Nithya Menon : మలయాళ భామ నిత్యా మీనన్ కి టాలీవుడ్ లో కూడా పాపులారిటీ ఉంది. 1998లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలైంది. కన్నడ చిత్రం 7 ఓ క్లాక్ హీరోయిన్ గా మొదటి చిత్రం. అలా మొదలైంది మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. దర్శకురాలు నందినీ రెడ్డి తెరకెక్కించిన అలా మొదలైంది సూపర్ హిట్. నాని హీరోగా నటించారు. ఇష్క్ చిత్రంతో భారీ ఫేమ్ రాబట్టింది. నితిన్ కి జంటగా నటించిన ఇష్క్ మంచి విజయం సాధించింది. అనూప్ రూబెన్స్ అందించిన సాంగ్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి.
గుండెజారి గల్లంతయ్యిందే, సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి హిట్ చిత్రాల్లో నిత్యా మీనన్ నటించింది. అయితే నిత్యా స్టార్ కాలేకపోయింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళ చిత్రాలు చేస్తూ వచ్చింది. భీమ్లా నాయక్ మూవీలో పవన్ కళ్యాణ్ భార్యగా ఆమె నటించడం విశేషం. ఈ చిత్రంలో నిత్యా మీనన్ రోల్ రెబల్ గా ఉంటుంది.
ఇటీవల శ్రీమతి కుమారి సిరీస్ తో అలరించింది. ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది. అలాగే ది బ్రీత్ హిందీ సిరీస్లో నిత్యా మీనన్ నటించడం విశేషం. ఈ సిరీస్లో ఓ అమ్మాయితో లిప్ లాక్ సన్నివేశాల్లో నిత్యా మీనన్ నటించింది. నిత్యా మీనన్ స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి. చాలా ఖరాకండీగా మాట్లాడుతుంది. ఆ మధ్య ప్రెగ్నెంట్ గా కనిపించి షాక్ ఇచ్చింది. వండర్ ఉమన్ మూవీ ప్రచారం కోసం నిజంగా గర్భవతి ఏమో అన్నట్లుగా భ్రమింపజేసింది.
ఇక నిత్యా మీనన్ కి పెళ్లీడు వచ్చి చాలా కాలం అవుతుంది. ఆమె వయసు 33 ఏళ్ళు. దీంతో పెళ్లి ఎప్పుడు? ఎలాంటి అబ్బాయి కావాలనే ప్రశ్నలు ఆమెను ఎదురవుతున్నాయి. అయితే పెళ్లి విషయంలో క్లారిటీగా ఉన్న నిత్యా మీనన్ తనకు ఎలాంటి భర్త కావాలో చెప్పింది. పెళ్లి అనేది సోషల్, ఫైనాన్సియల్ సెటప్ తో కూడిన వ్యవహారం. అంతకు మించి ఆలోచించే వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటానని వెల్లడించింది. మరి నిత్యాకు కోరుకున్నవాడు దొరుకుతాడో లేదో చూడాలి..