Nithya Menon: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ లేనటువంటి గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఇకమీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే చాలామంది హీరోయిన్లు సైతం వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు… నిత్యమీనన్ లాంటి హీరోయిన్ తెలుగులో చాలా సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా ఆమె చేసిన అలా మొదలైంది, ఇష్క్, గుండెజారి గల్లంతయిందే లాంటి సినిమాలు తెలుగులో మంచి పాపులారిటీని సంపాదించుకున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఆమె తమిళ సినిమా ఇండస్ట్రీలో కూడా పలు సినిమాల్లో నటించి మంచి ఐడెంటిటీ ని సంపాదించుకుంది… ప్రస్తుతం ఆమె ‘ఇడ్లీ కడై’ అనే సినిమాలో నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ఆమె పశువుల దగ్గర పేడ తీసే క్యారెక్టర్ లో నటించాల్సి ఉంది. దానికోసం ఆమె ఛీ అని చిదరించుకోకుండా చాలా సెటిల్డ్ గా ఆ పాత్ర లో అయితే నటిస్తుందట.
Also Read: 50 ఏళ్ల వయసులో 20 ఏళ్ల లుక్, మాధవన్ గ్లామర్ సీక్రెట్ ఇదే!
అందులో భాగంగానే ఆమె పాత్రలో పర్ఫెక్ట్ గా నటిస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా జాతీయ పురస్కారాలకు హాజరైనప్పుడు ఆమె గోళ్ళల్లో ఆ పేడ తాలూకు అవశేషాలు అయితే ఉన్నాయట… ఇక దాన్ని చూసి ఆమె అలా హ్యాపీగా ఫీల్ అయినట్టుగా తెలియజేశారు.
వాటి అవశేషాలు నా గోర్లలో ఉండటం వల్ల వాటికి నేను చాలా దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఆమె మాటలను విన్న చాలా మంది స్నానం సరిగ్గా చేయడం లేదా ఒకవేళ స్నానం చేసిన కూడా వాటికి సంబంధించిన అవశేషాలు గోర్లల్లో ఉన్నాయంటే నువ్వేం పరిశుభ్రంగా ఉంటున్నావ్ అంటూ ఆమె మీద కామెంట్లు అయితే చేస్తున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల ఆమె ఫుల్ గా ట్రోల్ అవుతుందనే చెప్పాలి.
Also Read: సినిమా ఈవెంటా..? రాజకీయ సభనా..? ఏంటిది పవన్!
అది మాత్రం మనకెలాంటి ఫీల్ కలిగినా కూడా పబ్లిక్ లో ఎలాంటి మాటలు మాట్లాడాలి అనేది కొంతవరకు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అంటూ కామెంట్లు అయితే చేస్తున్నారు… ఇక ప్రస్తుతం నిత్యామీనన్ మరోసారి తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు…