Nithin- BJP: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హీటు కొనసాగుతుంది. అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కి షాక్ ఇచ్చిన ఆ సీటు కైవసం చేసుకోవాలని బీజేపీ శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. దీని కోసం వేయాల్సిన ఎత్తులన్నీ వేస్తుంది. ఊహించని విధంగా టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, నితిన్ లను బీజేపీ జాతీయ నాయకులు కలిశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలవడం పెను సంచలనమైంది. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేసిన ఎన్టీఆర్… తర్వాత జరిగిన పరిణామాల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. టీడీపీకి సంబంధించిన ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం లేదు.

అయితే తన తాత స్థాపించిన టీడీపీని హస్తగతం చేసుకోవాలనే ఆలోచన మాత్రం ఆయన మదిలో ఉందనేది వాస్తవం. ఆ విషయం పక్కన పెడితే మరో హీరో నితిన్ బీజేపీ కీలక నేత జేపీ నడ్డాను కలిశారు. సడన్ గా ఇద్దరు పాపులర్ హీరోలను ఢిల్లీ స్థాయి బీజేపీ పెద్దలు కలవడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అనేది స్పష్టం. మునుగోడు ఉప ఎన్నికలతో పాటు ఏపీ, తెలంగాణాలలో రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం దీర్ఘకాలిక ప్రణాళిక అనుకోవచ్చు. అమిత్ షాను కలిసినందుకు తెలంగాణ గవర్నమెంట్ ఎన్టీఆర్ కి ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ గెస్ట్ గా వస్తున్నాడనే కారణంతో బ్రహ్మాస్త్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చివరి నిమిషంలో పర్మిషన్ ఇవ్వకుండా షాక్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే జేపీ నడ్డా రాంగ్ పర్సన్ ని కలిశారట. నిజానికి నితిన్ కి బదులు కార్తికేయ 2 హీరో నిఖిల్ ని కలవాల్సిందట. పొరపాటున నిఖిల్ అనుకుని నితిన్ కి ఆహ్వానం పంపారట. కార్తికేయ 2 కృష్ణతత్త్వం, హిందూ గొప్పతనం వివరించేదిగా తెరకెక్కింది. అలాగే హిందీలో కూడా సక్సెస్ సాధించి నేషనల్ వైడ్ పాపులారిటీ తెచ్చుకుంది . హిందూ భావాలను జనాల్లోకి తీసుకెళ్లే పార్టీగా నిఖిల్ ని కలవడం తమకు కలిసొస్తుందని, కృష్ణ భగవానుడి చిత్రంలో నటించిన హీరోని సన్మానించడం మంచిదని భావించారట. మరి పొరపాటు ఎక్కడ జరిగిందో తెలియదు. నిఖిల్- నితిన్ విషయంలో తికమకపడ్డారట. టాలీవుడ్ లో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా ఉంది.

మరోవైపు కార్తికేయ 2 వరల్డ్ వైడ్ రూ. 111 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. హిందీ వర్షన్ రూ. 30 కోట్ల నెట్ కలెక్షన్స్ కి దగ్గరైంది. ఓవర్సీస్ లో కార్తికేయ 2 ఏకంగా $ 1.5 మిలియన్ వసూళ్లు క్రాస్ చేసింది. మూడు వారాలు దాటినా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతూ… బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.