Chiranjeevi- Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు ఖరారు చేస్తున్నాయి. అధికార పార్టీ వైసీపీని ఎదుర్కొనేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కచ్చితంగా అధికారం చేపడుతుందని మెగా హీరోలు ఐక్యంగా నిలిచి పోరాడేందుకు సిద్ధపడుతున్నారు. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో మెగాస్టార్ చిరంజీవి సైతం పవన్ కల్యాణ్ పార్టీ జనసేన పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు నడుం కడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే జరిగితే ఏపీ రాజకీయాల్లో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2018లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చారు. అంతా ఆయన సీఎం అవుతారని ఆశించారు. కానీ అలా జరగలేదు. కేవలం 18 సీట్లు గెలుచుకోవడంతో గత్యంతరం లేక పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారు. ఫలితంగా కేంద్ర మంత్రి పదవి పొందారు. దీంతో ప్రస్తుతం ఆయన తమ్ముడి కోసం రాజకీయాల్లోకి మళ్లీ వచ్చేందుకు రెడీ అవుతున్నారు. రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయంగా పార్టీ రావాల్సిన అవసరం ఉందని గుర్తించి జనసేన పార్టీని గెలిపించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న పవన్ కళ్యాణ్ ఇమేజ్
2014 ఎన్నికల్లో జనసేన టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో టీడీపీకి అధికారం దక్కింది. 2019 జనసేన ఒంటరిగా పోటీ చేసింది. పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓటమి పాలు కావడంతో పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. టీడీపీ కూడా అధికారానికి దూరమైంది. వైసీపీ అధికారం చేపట్టడంతో టీడీపీ, జనసేన పార్టీలకు చేదు ఫలితం ఎదురైంది. ఇప్పుడు జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరోవైపు వైసీపీని నిలువరించాలంటే ఇవి రెండు ఒక్కటి కావాల్సిన అవసరం ఏర్పడిందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

పవన్ కల్యాణ్ కోసం మెగా హీరోలు చిరంజీవి, నాగబాబు ప్రచారం చేసేందుకు నిర్ణయించుకున్నారు. 2024 ఎన్నికల్లో ఎలాగైనా అధికార పార్టీని గద్దె దించాలనే తాపత్రయంతో మెగా బ్రదర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే జనసేన పార్టీకి జవసత్వాలు నింపాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. నాగబాబు ఇప్పటికే జనసేనలో కీలక పాత్ర పోషిస్తుండటంతో చిరంజీవి ఒక్కరే ప్రత్యక్షంగా దిగాల్సి ఉంది. మెగా బ్రదర్స్ రంగంలోకి దిగితే పరిస్థితిలో మార్పు కచ్చితంగా వస్తుందని అంచనా వేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఆశలు తీర్చేందుకు ఇద్దరు అన్నలు ఒక్కటిగా కలిసి నడుస్తారని ప్రచారం సాగుతోంది.
Also Read:Odisha- Ant Attacks: ఒడిశాలో ఓ ఊరిపై విషపూరిత చీమల దాడి.. పారిపోయిన గ్రామస్థులు
[…] […]