Nithin Pan India Movie: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యంకానీ రీతిలో గొప్ప సినిమాలను తీసిన హీరోలు చాలామంది ఉన్నారు. హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు…ఇక ఇలాంటి క్రమంలోనే పాన్ ఇండియా వైడ్ గా తెలుగు సినిమా అనేది భారీ గుర్తింపును సంపాదించుకుంది. మరి సందర్భంగా సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలైతే ఉన్నాయి. అందువల్లే సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే లభిస్తోంది… ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలందరు మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. నితిన్ లాంటి స్టార్ హీరో మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిమితమవుతున్నాడు. మరి ఎందుకని ఆయన పాన్ ఇండియా సినిమా చేయలేకపోతున్నాడు…ఇక దీనికి సమాధానంగా కొంతమంది సినిమా మేధావులైతే ఆయన చేసిన సినిమాలు తెలుగులోనే మెప్పించడం లేదు ఇక పాన్ ఇండియా సినిమా ఆయన మాత్రం ఏం చేస్తాడు అంటూ అతని మీద కొన్ని విమర్శలైతే చేస్తున్నారు. మరి ఆ విమర్శలన్నింటిని తట్టుకొని ఆయన రాబోయే ఎల్లమ్మ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక వేణు ఎల్దండీ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా విషయంలో నితిన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
Also Read: విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ టైటిల్ మార్పు..కొత్త టైటిల్ ఇదే..కారణం ఏంటంటే!
రీసెంట్ గా వచ్చిన తమ్ముడు (Tammudu) సినిమాతో డిజాస్టర్ ని మూటగట్టుకున్న నితిన్ మరోసారి దిల్ రాజు బ్యానర్ లోనే ఎల్లమ్మ (Yellamma) సినిమా చేయడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాలని అతని అభిమానులైతే కోరుకుంటున్నారు. తద్వారా యంగ్ హీరోలందరు పాన్ ఇండియా బాటపడుతున్నారు.
కాబట్టి తను కూడా పాన్ ఇండియా సినిమా చేస్తే చూడాలని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…ఇక నితిన్ మాత్రం పాన్ ఇండియా సబ్జెక్టు దొరికితే తప్పకుండా పాన్ ఇండియా సినిమా చేస్తానని అప్పటిదాకా నార్మల్ తెలుగు పరిమితమయ్యే సినిమాలు మాత్రమే చేస్తానని ఆయన గతంలోనే వెల్లడించాడు.
మరి ఇప్పటికైనా ఆయన పాన్ ఇండియా సినిమాలను చేసి తన మార్కెట్ ను పదిలంగా ఉంచుకుంటే మంచిదని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… చూడాలి మరి నితిన్ పాన్ ఇండియా సబ్జెక్టుని ఎప్పుడు చేస్తాడు తద్వారా ఇండియా వైడ్ గా ఆయన ఎప్పుడూ రికార్డ్స్ బ్రేక్ చేస్తాడు అనేది…