యంగ్ హీరో నితిన్ అభిమానులకు సడన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. రేపు(మార్చి 30న) నితిన్ పుట్టిన రోజును పురస్కరించుకొని తన తాజా చిత్రం ‘రంగ్ దే’ మోషన్ పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ మూవీలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. ‘రంగ్ దే’ ట్యాగ్ లైన్ ‘గిమ్మీ సమ్ లవ్’. ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను స్లో మోషన్‌లో క్లాసికల్ మ్యూజిక్‌తో రూపొందించారు. ఇందులో హీరో, హీరోయిన్ ఫస్ట్ లుక్‌తోపాటు ‘రంగ్ దే’ టైటిల్‌ను చూపించారు.
26సెకన్ల నిడివిగల ఈ మోషన్ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. చిత్రంలో హీరో నితిన్ అర్జున్‌గా, హీరోయిన్ అనుగా కీర్తి సురేష్ కనిపించనున్నట్లు ఈ మోషన్ పోస్టర్లో రివీల్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ ఇలా రిలీజైందో లేదో అప్పుడే సుమారు లక్షా30 వేల వ్యూస్ వచ్చాయి. ఇటీవల నితిన్ ‘భీష్మ’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు. ఈ మూవీలో నితిన్ కు జోడీగా రష్మిక మందన్న నటించింది. వీరిద్దరి జోడీకి ప్రేక్షకులు కలెక్షన్ల వర్షం కురిపించారు.
Here is the 1st look motion poster of RANG DE ❤️❤️ https://t.co/pAw1HZfIOl@pcsreeram @ThisIsDSP @dirvenky_atluri @KeerthyOfficial @vamsi84 @SitharaEnts @haarikahassine
— nithiin (@actor_nithiin) March 29, 2020
‘రంగ్ దే’ మూవీని నితిన్ 29వ సినిమాగా తెరకెక్కుతుంది. దర్శకుడు వెంకీ అట్లూరి ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ‘రంగ్ దే’ మూవీని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవలే ‘రంగ్ దే’ సెట్స్ పైకి వెళ్లింది. దేశంలో లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ను నిలివేశారు. అదేవిధంగా దేశంలో కరోనా కారణంగా తన బర్త్ డే వేడుకకు నితిన్ దూరంగా ఉంటున్నాడు. ఏప్రిల్ 16న జరగాల్సిన తన పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు సమాచారం.