#Nikhil20 : హ్యాపీ డేస్ మూవీలో సపోర్టింగ్ రోల్ చేసిన నిఖిల్ సిద్ధార్థ్ ఎదిగిన తీరు స్ఫూర్తి దాయకం. స్టార్ హీరోలకు పోటీ ఇస్తున్న నిఖిల్ వరుస పాన్ ఇండియా చిత్రాలు ప్రకటిస్తున్నారు. తాజాగా ఆయన మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశారు. నిఖిల్ 20వ చిత్ర ప్రకటన అబ్బురపరుస్తుంది. రాజదండంతో కూడిన ప్రీ లుక్ క్యూరియాసిటీ పెంచేసింది. డెబ్యూ డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి తెరకెక్కించనున్నారు.
తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారట. ఈ చిత్ర పూర్తి వివరాలు నిఖిల్ బర్త్ డే కానుకగా ప్రకటించనున్నారు. ఈ మూవీలో నిఖిల్ పాత్ర పై చర్చ నడుస్తుంది. ఆయన రూలర్ గా కనిపించనున్నారట. ఇది ఫాంటసీతో కూడిన పీరియాడిక్ డ్రామా కావచ్చు అంటున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్ అండ్ శ్రీకర్ నిర్మిస్తున్నారు. కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు.
ఆల్రెడీ నిఖిల్ స్పై టైటిల్ తో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. గ్యారీ బి హెచ్ ఈ చిత్ర దర్శకుడు. స్పై ప్రోమోలు దుమ్మురేపాయి. నిఖిల్ స్పై రోల్ లో మెస్మరైజ్ చేస్తున్నాడు. స్పై మూవీలో నిఖిల్ కి జంటగా ఐశ్వర్య మీనన్ నటిస్తుంది. స్పై సుభాష్ చంద్రబోస్ మరణం చుట్టూ తిరుగుతుంది. ఆయన అసలు ఏమయ్యారనేది తెలుసుకోవడానికి బయలుదేరిన స్పై గా నిఖిల్ కనిపించనున్నారు.
ఇక గత ఏడాది నిఖిల్ కార్తికేయ 2 చిత్రంతో సంచలనం చేశారు. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన సోసియో ఫాంటసీ చిత్రం కార్తికేయ 2 ఇండియా వైడ్ ఆదరణ దక్కించుకుంది. హిందీలో ముపై కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. కార్తికేయ 2 ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేసింది. నిఖిల్ మార్కెట్ పెరిగిన నేపథ్యంలో నిర్మాతలు ఆయనతో భారీ చిత్రాలు చేస్తున్నారు.
Recommended Video:
