
యంగ్ హీరో నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త చిత్రం నుంచి ఓ మాంచి పోస్టర్ రిలీజ్ అయ్యింది. నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా కార్తీకేయ 2 నిర్మాతలు ఈ రోజు కొత్త పోస్టర్‌ను ఆవిష్కరించారు.
పోస్టర్ ఆసక్తికరమైన రంగుల పాలెట్‌తో ఆకర్షనీయంగా కనిపిస్తోంది. “ సంక్షోభంలో నిజమైన సేవకులు బయటపడతారు” అని పోస్టర్ లో నిఖిల్ కరోనా వేళ చేస్తున్న సాయాన్ని గుర్తూ డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. సీరియస్ భావోద్వేగాలతో కలిగి ఉన్న నిఖిల్ పోస్టర్ గంభీరంగా కనిపిస్తోంది.
కోవిడ్ రెండోవేవ్ ప్రారంభం కారణంగా కార్తికేయ 2 షూటింగ్ ఆగిపోయింది. రెండో వేవ్ ఫ్లాట్ ముగిసిన తర్వాత తిరిగి షూటింగ్ చేయాలని యూనిట్ భావిస్తోంది.
చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఇదీ ఒకటి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.