Nikhil Spy 2 Days Collections : యంగ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం ‘స్పై’. విడుదలకు ముందే ఆసక్తికరమైన టీజర్ మరియు ట్రైలర్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే మొదటి నుండి ఈ చిత్రానికి మంచి అంచనాలు ఉన్న కారణంగా మొదటి రోజు టాక్ తో సంబంధం లేకుండా అద్భుతమైన ఓపెనింగ్ ని దక్కించుకుంది.
ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి ఈ సినిమాకి మొదటి రోజు పది కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. నిఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇది, కానీ రెండవ రోజు మాత్రం టాక్ ప్రభావం చాలా గట్టిగానే పడింది. అన్నీ ప్రాంతాలలో ఈ చిత్రానికి 70 శాతం కి పైగా వసూళ్లు మొదటి రోజుతో పోలిస్తే డ్రాప్ అయ్యాయట. 70 శాతం వసూళ్లు డ్రాప్ అంటే సాధారణమైన విషయం కాదు.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రెండవ రోజు కేవలం మూడు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి అట. ఈ గ్రాస్ వసూళ్లకు షేర్ లెక్కగడితే కేవలం కోటి 30 లక్షలు రూపాయిలు మాత్రమే వచ్చింది. ఇది మంచి బ్రేక్ ఈవెన్ అయ్యే రేంజ్ ట్రెండ్ కాదు. దానికి తోడు ‘ఈ నగరానికి ఏమైంది’ మరియు ‘తొలిప్రేమ’ వంటి చిత్రాలు రీ రిలీజ్ అయినా ప్రభావం కూడా ఈ చిత్రం పై గట్టిగానే పడింది.
టాక్ వచ్చి ఉంటే ఆ రెండు చిత్రాల ప్రభావం దీని మీద ఉండేది కాదు. టాక్ రాలేదు కాబట్టే ఆ పాత సినిమాల రీ రిలీజ్ ఎఫెక్ట్ దీని మీద బలంగా పడింది.ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 17 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. మొదటి రెండు రోజులకు కలిపి ఆరు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది, ఇక రాబొయ్యే రోజుల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది ఈ వీకెండ్ వసూళ్ల మీద ఆధారపడి ఉంటుంది.