Spy Movie Teaser: ‘సుభాష్ చంద్రబోస్’ బ్రతికే ఉన్నాడా..? ఆసక్తి కలిగిస్తున్న నిఖిల్ ‘స్పై’ మూవీ టీజర్!

నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానం క్రాష్ అయ్యి చనిపోయాడని అందరూ అంటూ ఉంటారు. కానీ ఆయన అస్తికలు మాత్రం ఇప్పటి వరకు ఇండియా కి చేరుకోలేదు. అంటే సుభాష్ చంద్రబోస్ బ్రతికే ఉన్నాడా?,

Written By: Vicky, Updated On : May 15, 2023 7:10 pm

Spy Movie Teaser

Follow us on

Spy Movie Teaser: సినిమా సినిమాకి తనలోని విభిన్నమైన కోణాన్ని ఆవిష్కరిస్తూ, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చే హీరోలలో ఒకడు నిఖిల్ సిద్దార్థ్. ఇతని ప్రతీ సినిమా ఎంతో కొత్తగా,అంతకు ముందు ఎవ్వరూ ముట్టుకొని కథాంశాలతోనే తెరకెక్కుతాయి. ‘కార్తికేయ 2 ‘ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆయన చేసిన ’18 పేజెస్’ చిత్రం యావరేజి గా ఆడింది.

ఇప్పుడు ఆయన ‘స్పై’ అనే మూవీ తో పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని మరోసారి షేక్ చెయ్యడానికి వస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కాసేపటి క్రితమే విడుదల అయ్యింది. ఈ సినిమా టైటిల్ వినగానే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ కి సంబంధించిన సినిమా అని మనకి అర్థం అయిపోయింది. ఇక టీజర్ చూసిన తర్వాత ప్రేక్షకుల్లో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆతృతగా కలిగేలా చేసింది.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానం క్రాష్ అయ్యి చనిపోయాడని అందరూ అంటూ ఉంటారు. కానీ ఆయన అస్తికలు మాత్రం ఇప్పటి వరకు ఇండియా కి చేరుకోలేదు. అంటే సుభాష్ చంద్రబోస్ బ్రతికే ఉన్నాడా?, లేదా ఒకవేళ చనిపోయి ఉంటే ఎందుకు చనిపోయి ఉంటాడు..?,ఇలాంటి విషయాలన్నింటిని ఛేదించే స్పై ఏజెంట్ గా నిఖిల్ ఈ సినిమాలో నటిస్తున్నాడు.

ఇలాంటి సబ్జెక్టు మీద ఇప్పటి వరకు ఇండియా లో ఒక్క సినిమా కూడా తెరకెక్కలేదు, అలాంటి ఆలోచన వచ్చిన డైరెక్టర్ గ్యారీ BH కి నిజంగా సెల్యూట్ చెయ్యాల్సిందే. పాన్ ఇండియన్ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని దున్నేసే సబ్జెక్టు ఇది, డైరెక్టర్ సరిగ్గా తీసి ఉంటే కన్నడ లో ‘కాంతారా’ చిత్రం ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో, ఈ స్పై చిత్రం కూడా ప్రపంచవ్యాప్తంగా అలాంటి ప్రభంజనం సృష్టించబోతోంది అని అంటున్నారు విశ్లేషకులు,చూడాలి మరి.