Karthikeya 3: నిఖిల్ అనే పేరు వినిపిస్తే ముందుగా కార్తికేయ సినిమా గుర్తుకు వస్తుంది. ఆ రేంజ్ లో సక్సెస్ అయింది కార్తికేయ సినిమా. దీంతో దీనికి సీక్వెల్ ను తెరకెక్కించారు. చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ 1 సినిమా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్సెన్స్ థ్రిల్లర్ కి మైథాలజీ కాన్సెప్ట్ జత అవడంతో సూపర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో కార్తికేయ 2తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
కార్తికేయ 2 సినిమా కూడా సూపర్ సక్సెస్ అవడంతో నిఖిల్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమాలో కృష్ణుడు కాన్సెప్ట్ అద్భుతంగా ఉండడంతో మరింత ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఈ సినిమా నచ్చడంతో కార్తికేయ 3 కోసం భారీగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. అయితే సీక్వెల్ 3 కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించారు చిత్ర యూనిట్. కానీ ఈ సినిమా ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టమే. ఇక ఈ సినిమా గురించి తాజాగా నిఖిల్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. దీంతో కార్తికేయ 3 పక్కా అని ఫిక్స్ అయ్యారు అభిమానులు.
డా. కార్తికేయ కొత్త అడ్వెంచర్ ను వెతుకుతున్నాడని.. త్వరలోనే కార్తికేయ 3 ఉంటుందని ట్వీట్ చేశాడు నిఖిల్. దీంతో కార్తికేయ 3 కోసం ఎదురుచూసే అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద త్వరలోనే కార్తికేయ 3 ఉంటుందన్నమాట. ఇదిలా ఉంటే చందూ మొండేటి ప్రస్తుతం నాగచైతన్యతో తండేల్ సినిమా తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాతనే కార్తికేయ 3 అని టాక్.
కార్తికేయ 3 నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది. ఈ సారి మరింత క్యూరియాసిటీని పెంచేలా.. గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట. మరి చూడాలి ఈ సినిమా ఎలా ఉంటుంది. ఇక నిఖిల్ కూడా ప్రస్తుతం స్వయంభు, ది ఇండియా హౌస్ లాంటి భారీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉండడంతో కార్తికేయ 3 కాస్త ఆలస్యమే అని తెలుస్తోంది.
Dr. Karthikeya In Search of a Brand new Adventure … Soon @chandoomondeti #Karthikeya3 #Karthikeya2 #cinema #adventure pic.twitter.com/xoNeD3F2KI
— Nikhil Siddhartha (@actor_Nikhil) March 16, 2024