Nikhil – Gaurav out of Bigg Boss 9: ప్రతీ వారం లో లాగానే ఈ వారం లో కూడా ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) లో ఊహించని ఎలిమినేషన్ జరిగింది. ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందని కొందరు, వచ్చే వారం ఫ్యామిలీ వీక్ కాబట్టి అసలు ఎలిమినేషన్ ఉండదు అని మరికొందరు పెద్ద ఎత్తున సోషల్ మీడియా లో ప్రచారం చేశారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదట. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ని ప్లాన్ చేశారట నిర్వాహకులు. ఓటింగ్ ప్రకారం చివరి మూడు స్థానాల్లో దివ్య నిఖిత, గౌరవ్ మరియు నిఖిల్ ఉన్నారు. వీరిలో దివ్య ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు, కానీ ట్విస్టుల ట్విస్టులు జరిగి నిఖిల్, గౌరవ్ ఎలిమినేట్ అయ్యినట్టు తెలుస్తోంది. శనివారం రోజు అనగా ఈరోజుటి ఎపిసోడ్ లో ఒకరు, ఆదివారం రోజు అనగా రేపటి ఎపిసోడ్ లో మరొకరు ఎలిమినేట్ అవుతారు.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం చూస్తే శనివారం ఎపిసోడ్ లో గౌరవ్ ఎలిమినేట్ అవుతాడట. ఆ తర్వాత ఆదివారం ఎపిసోడ్ మంచి నాటకీయ పరిణామం లో దివ్య, నిఖిల్ లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిఖిల్ గత వారం అద్భుతంగా ఆడాడు. కచ్చితంగా ఇతని గ్రాఫ్ పెరిగి ఉంటుందని అనుకున్నారు కానీ, అలాంటిదేమి జరగలేదు. నిఖిల్ కంటే దివ్య కి ఎక్కువ ఓటింగ్ వచ్చినట్టు తెలుస్తోంది. ఎలిమినేషన్ రౌండ్ లో నిఖిల్, దివ్య నిల్చుంటారని, దివ్య సేవ్ అయ్యి, నిఖిల్ ఎలిమినేట్ అవుతాడని, కానీ తనూజ వద్ద గోల్డెన్ బజర్ ఉండడం తో ఆమె ఆ పవర్ ని నిఖిల్ సేవింగ్ కోసం కచ్చితంగా ఉపయోగించదని, ఆడియన్స్ ఓటింగ్ కి గౌరవం ఇచ్చి నిఖిల్ నే ఎలిమినేట్ అయ్యేలా చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇదే ఆమెకు గోల్డెన్ బజర్ మీద అధికారం ఉండే చివరి వారం.
అలా కాకుండా నిఖిల్ గత వారం లో అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చాడు కాబట్టి, ఇంకొక్క వారం అవకాశం ఇస్తే కచ్చితంగా తన ఆటను మరింత మెరుగుపరచుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి, నిఖిల్ ని సేవ్ చేసి దివ్య ని ఎలిమినేట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. కానీ ఇది 99 శాతం జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే అలా చేస్తే తనూజ ఆడియన్స్ దృష్టిలో పూర్తిగా నెగిటివ్ అయిపోతుంది. దివ్య తో తనకు గొడవలు ఉన్నాయి కాబట్టి, ఆ కక్ష్య తోనే సరిగ్గా ఆమెను ఫ్యామిలీ వీక్ కూడా ఎంజాయ్ చేయనివ్వకుండా ఎలిమినేట్ చేసిందని అందరూ తిడుతారు. కాబట్టి తనూజ తెలిసి అంత పెద్ద తప్పు పని చేయదు. ఒకవేళ దివ్య ఎలిమినేట్ అయినా, ఆమె గోల్డెన్ బజర్ ని దివ్య ని సేవ్ చేయడం కోసం ఉపయోగిస్తుంది. చూడాలి మరి ఈరోజు, రేపు ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది.