Niharika Konidela: మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ నిహారిక. హీరోయిన్ గా సక్సెస్ కాకున్నా సినిమాపై మక్కువ వదల్లేదు. పెళ్లి తర్వాత కూడా నిర్మాతగా కొనసాగుతున్నారు. ఒక మనసు మూవీతో నిహారిక సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఒక మనసు మూవీలో నాగ శౌర్య హీరోగా చేశాడు. ఒక మనసు మూవీ డీసెంట్ టాక్ దక్కించుకుంది. ట్రాజిక్ ఎండింగ్ కావడంతో కమర్షియల్ గా ఆడలేదు. ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడలేదు. హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం అంటూ మరో రెండు చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించారు.

మెగా ఫ్యామిలీ నుండి నిహారికకు పెద్దగా మద్దతు లభించలేదు. నిహారిక హీరోయిన్ కావడాన్ని మెగా అభిమానులు తీవ్రంగా వ్యతిరేకించారు. నిహారిక ఫెయిల్యూర్ కి అది కూడా ఒక కారణం. దీంతో నిర్మాతగా సినిమా చేస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్లో షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్లు, చిత్రాలు చేస్తున్నారు. నిహారిక నిర్మాతగా పలు వెబ్ సిరీస్లు తెరకెక్కాయి. వాటిలో కొన్ని మంచి విజయం సాధించాయి.
హీరోయిన్ గా బ్రేక్ రాకపోవడంతో నిహారిక పెద్దల మాట మేరకు పెళ్లి చేసుకున్నారు. చిరంజీవి కుటుంబానికి సన్నిహితుడైన ప్రభాకర్ రావు కుమారుడు వెంకట చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం జరిగింది. నిహారిక-వెంకట చైతన్యల వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. 2020లో నిహారిక వివాహం జరగ్గా అత్తమామల అనుమతితో పరిశ్రమలో కొనసాగుతున్నారు.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిహారిక ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేస్తారు. తాజాగా నిహారిక ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె స్నేహితులతో పాటు టర్కీ దేశం టూర్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ అందమైన ప్రదేశాల్లో నిహారిక ఆహ్లాదంగా గడిపిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. హాట్ ట్రెండీ వేర్ లో నిహారిక సరికొత్తగా కనిపించారు. చివరికి నిహారిక బికినీ గురించి ధరించినట్లు ఉన్నారు.
అమ్మానాన్నల కంటే అత్తమామలు తనకు ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తున్నారని నిహారిక ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆమె చెప్పిన మాట అక్షరాలా నిజం అనిపిస్తుంది. పర్సనల్ గా ప్రొఫెషనల్ గా ఆమె అభిప్రాయాలను గౌరవిస్తూ స్వేచ్ఛ ఇస్తున్నారు. మ్యారీడ్ లైఫ్ నిహారిక ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.