Niharika Konidela : సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ మరే ఫ్యామిలీకి లేదు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి ఎంత మంది హీరోలు ఉన్నప్పటికీ, మెగా డాటర్ గా ‘నిహారిక కొణిదల’ కూడా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇండస్ట్రీ లో వన్ అండ్ ఓన్లీ మెగా డాటర్ గా మంచి పెరైతే తెచ్చుకుంది. ఇక చైతన్య తో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న నిహారిక ఆయనతో వచ్చిన కొన్ని విభేదాల వల్ల కొద్దీ రోజులకే ఆయన నుంచి డివోర్స్ కూడా తీసుకుంది.
ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆమె స్వంతంగా ప్రొడక్షన్ హౌస్ ని కూడా స్టార్ట్ చేసి పలు సినిమాలను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక తను ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియా లో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. ఇక అందులో భాగంగానే తనకు నచ్చిన విధంగా డ్రెస్ ఆప్ అవుతూ ఫోటో షూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఇక రీసెంట్ గా ‘నీలిరంగు చీరలో దిగిన ఫోటోలు’ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా తన అభిమానుల నుంచి విశేష స్పందన వస్తుంది. కొంతమందైతే నీలిరంగు చీరలో నిహారిక కొణిదల ఏంజిల్ లా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక తనకి డివోర్స్ అయిన తర్వాత నుంచి తను చాలా యాక్టివ్ గా ఉంటూ సినిమాలకు సంబంధించిన పనుల్లో చాలా చురుకుగా పాల్గొంటున్నట్టు గా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా వాళ్ళ బ్రదర్ అయిన వరుణ్ తేజ్ మ్యారేజ్ తర్వాత నుంచి లావణ్య త్రిపాఠి తో కలిసి సందడి కూడా చేస్తుంది. ఇక వాళ్ళ కుటుంబంలో ఏ ఫంక్షన్ జరిగిన కూడా నిహారిక నే చాలా సందడిగా కనిపిస్తూ ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో జోష్ నింపే ప్రయత్నం చేస్తుంది… ఇక మొత్తానికి అయితే ఆమె ప్రస్తుతం తన కెరీయర్ ను బిల్డ్ చేసుకున్న తర్వాత నే తన రెండో పెళ్లి గురించి ఆలోచిస్తానని ఇంతకుముందు చాలాసార్లు క్లారిటీ ఇచ్చింది…