https://oktelugu.com/

Ali tho Saradaga: మా నలుగురికి మెంటల్ ఉందంటూ… సంచలన నిజాలు బయట పెట్టిన నిహారిక కొణిదెల

Ali tho Saradaga: ఈ మధ్య కాలంలో బుల్లి తెర పై ఉన్న టాక్ షో లలో క్రేజీ టాక్ షో గా పేరు పొందింది మాత్రం ‘అలీ తో సరదాగా’. టాలీవుడ్ కమెడియన్ అలీ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న ఈ షో ని జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది. కొత్త – పాత, చిన్నా- పెద్దా, వెండితెర – బుల్లితెర అని తేడా లేకుండా ప్రతి ఒక్క సెలబ్రిటీ ని పిలిచి సరదాగా ప్రేక్షకులకి తెలియని ముచ్చట్లు పంచిపెడుతున్నారు. […]

Written By:
  • NVN Ravali
  • , Updated On : November 18, 2021 / 05:06 PM IST
    Follow us on

    Ali tho Saradaga: ఈ మధ్య కాలంలో బుల్లి తెర పై ఉన్న టాక్ షో లలో క్రేజీ టాక్ షో గా పేరు పొందింది మాత్రం ‘అలీ తో సరదాగా’. టాలీవుడ్ కమెడియన్ అలీ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న ఈ షో ని జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది. కొత్త – పాత, చిన్నా- పెద్దా, వెండితెర – బుల్లితెర అని తేడా లేకుండా ప్రతి ఒక్క సెలబ్రిటీ ని పిలిచి సరదాగా ప్రేక్షకులకి తెలియని ముచ్చట్లు పంచిపెడుతున్నారు.

    మెగా కుటుంబంలో మోస్ట్ ఫన్నీ ఎవరు అంటేక్షణం ఆలోచించకుండా టక్కున చెప్పే సమాధానం నిహారిక (Niharika Konidela). ఎప్పుడు చూసినా చాలా సరదాగా, చురుకుగా నవ్వుకుంటూ.. అందరిని నవ్విస్తూ ఉంటుంది నిహారిక. సినిమాకి సంబంధించి బయట ప్రమోషన్స్ కు వచ్చినా.. ఇంట్లో ఫంక్షన్ జరిగినా చాలా చలాకీగా కనిపిస్తూ సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంది నిహా. చివరికి సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోలింగ్స్ ను కూడా చాలా పాజిటివ్ గా తీసుకుంటూ ఉంటుంది నిహారిక.

    నిహారిక ఒకవైపు నటనతో మెప్పిస్తూ మరోవైపు నిర్మాతగా తనదైన ముద్ర వేస్తుంది. అయితే నవంబర్ 19న జీ 5 లో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ విడుదల కాబోతుంది. ఈ సిరీస్ ని నిహారిక కొణిదెల నిర్మిస్తుంది. ఈ నేపథ్యం లో ప్రేక్షకులని అలరించడానికి మెగా డాటర్, కొణిదెల ఆడపిల్ల నిహారిక కొణిదెల వచ్చే వారం అలీ తో సరదాగా లో మెరవనున్ననట్లు తాజాగా విడుదల చేసిన ప్రోమో లో తెలిసిపోతుంది.

    ఈ క్రమం లో అలీ నిహారికని కొన్ని ప్రశ్నలు వెయ్యగా వాటికి చాలా సరదాగా జవాబిచ్చింది నిహారిక. అయితే కొన్ని ప్రశ్నలకి ఫన్నీ గా బదులిచ్చింది కూడా. దాంతోపాటు తమ కుటుంబంలో నలుగురికి లైట్ గా మెంటల్ ఉందంటూ సరదాగా వ్యాఖ్యలు చేసింది నిహారిక. తనకు, తన చిన్నత్తకు, సాయి ధరమ్ తేజ్ కు, అలాగే నాగబాబుకు లైట్ గా మెంటల్ ఉందని.. తామంతా ఒకటే జాతికి చెందిన వాళ్ళం అంటూ చెప్పుకొచ్చింది. అలా ఈ ప్రోమో లో ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

    Tags