Homeఎంటర్టైన్మెంట్Niharika Konidela: అల్లు అర్జున్ ని సాయి ధరమ్ ఎందుకు అన్ ఫాలో చేశాడు... మేటర్...

Niharika Konidela: అల్లు అర్జున్ ని సాయి ధరమ్ ఎందుకు అన్ ఫాలో చేశాడు… మేటర్ ఇదే అన్న నిహారిక!

Niharika Konidela: అల్లు-కొణిదెల కుటుంబాల మధ్య మనస్పర్థలు ఉన్నాయనే వాదన కొన్నాళ్లుగా ఉంది. ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలతో మరింత క్లారిటీ వచ్చింది. మెగా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫ్యాన్ వార్స్ నడుస్తున్నాయి. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేయడం పెద్ద చర్చకి దారి తీసింది. కాగా సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేయడం పై తాజాగా నిహారిక కొణిదెల స్పందించింది. ఆసక్తికర సమాధానం ఇచ్చింది.

కమిటీ కుర్రాళ్లు టీజర్ లాంచ్ ఈవెంట్ కి నిహారిక కొణిదెల హాజరయ్యారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో ఓ మీడియా ప్రతినిధి అల్లు అర్జున్ ని సాయి ధరమ్ తేజ్ అన్ ఫాలో అవ్వడం గురించి అడిగారు. దానికి చాలా తెలివిగా నిహారిక సమాధానం ఇచ్చారు. నిహారిక మాట్లాడుతూ .. ఈ ప్రశ్న అడిగే వరకు కూడా నాకు ఈ విషయం తెలియదు. అయినా అలా చేసారంటే ఎవరి కారణాలు వాళ్ళకి ఉంటాయి, అని నిహారిక చెప్పింది.

Also Read: Son of Satyamurthy child artist: సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలోని పాప ఇంత పెద్దది అయ్యిందా… ఆమె లేటెస్ట్ లుక్ చూస్తే షాక్ అవుతారు!

ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత అల్లు అర్జున్ ని మెగా ఫ్యాన్స్, జన సైనికులు ఎంతలా ట్రోల్ చేశారో తెలిసిందే. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయగా మెగా ఫ్యామిలీ మొత్తం ఆయన గెలుపు కోసం రంగంలోకి దిగారు. అల్లు అర్జున్ మాత్రం తన స్నేహితుడు వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతు తెలిపారు. నంద్యాల వెళ్లి శిల్పా రవిని కలిశారు.ఈ పరిణామంతో మెగా ఫ్యామిలీ షాక్ కి గురయ్యారు. మెగా ఫ్యాన్స్ బన్నీ పై విమర్శలు గుప్పించారు.

Also Read: Actress Hema: జైలు నుంచి విడుదలైన నటి హేమ… ఇప్పుడు ఏం చేస్తుంది? ఆమె భవిష్యత్తు ఏమిటీ?

నాగ బాబు సైతం అల్లు అర్జున్ కి పరోక్షంగా కౌంటర్లు వేయడం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. మెగా ఫ్యాన్స్ , అల్లు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒకరినొకరు తిట్టుకున్నారు. అల్లు – మెగా కుటుంబాల వైరం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పైగా అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఒక్కరు కూడా రాలేదు. దీంతో పుకార్లకు మరింత బలం చేకూరింది.

RELATED ARTICLES

Most Popular