https://oktelugu.com/

నిహారిక పెళ్లి విశేషాలు.. ప్రత్యేక ఆహ్వానితుల్లో ఇద్దరు హీరోయిన్స్ !

మెగా డాటర్ నిహారిక కొణిదెల వివాహం చైతన్య జొన్నలగడ్డతో ఈ డిసెంబర్ 9న ఉదయ్ పూర్ లోని ఉదయ్ ప్యాలెస్ లో అత్యంత వైభవంగా జరగనుంది. రెండు రోజుల పాటు సాగే ఈ పెళ్లి కోసం ఇప్పటికే వధూవరులు ఇరు కుటుంబాలతో వెన్యూ వద్దకు వెళ్లారు. కాగా సంగీత్‌ వేడుక సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు మొదలై… అర్ధరాత్రి వరకూ జరిగిందని.. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం పాల్గొన్నారు. ఇక హల్దీ ఫంక్షన్‌ మంగళవారం […]

Written By:
  • admin
  • , Updated On : December 8, 2020 / 09:56 AM IST
    Follow us on


    మెగా డాటర్ నిహారిక కొణిదెల వివాహం చైతన్య జొన్నలగడ్డతో ఈ డిసెంబర్ 9న ఉదయ్ పూర్ లోని ఉదయ్ ప్యాలెస్ లో అత్యంత వైభవంగా జరగనుంది. రెండు రోజుల పాటు సాగే ఈ పెళ్లి కోసం ఇప్పటికే వధూవరులు ఇరు కుటుంబాలతో వెన్యూ వద్దకు వెళ్లారు. కాగా సంగీత్‌ వేడుక సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు మొదలై… అర్ధరాత్రి వరకూ జరిగిందని.. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం పాల్గొన్నారు. ఇక హల్దీ ఫంక్షన్‌ మంగళవారం మధ్యాహ్నం 4 గంటలకు జరగనుంది. అలాగే మెహందీ వేడుక బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు మొదలై రాత్రి పది గంటల వరకూ జరగనుంది. ఇక వివాహ మహోత్సవం బుధవారం రాత్రి 7.15 గంటలకు జరగనుంది.

    Also Read: సీత గురించి రాజమౌళితో ఆలియా ముచ్చట్లు !

    ఈ వివాహానికి మొత్తం 120మంది సన్నిహితులను బంధువులను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. పైగా పెళ్లికి ఆహ్వానించిన సమయంలో అందరికీ పట్టు వస్త్రాలు ఇచ్చి ఆహ్వానించారని తెలుస్తోంది. ఇక ఆహ్వానితులందరూ సోమవారమే వివిధ విమానాల్లో ఉదయ్‌పూర్‌ చేరుకుని సంగీత్ ఫంక్షన్ లో పాల్గొన్నారు. ఇక ఈ వివాహానికి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వెళ్లినవారిలో కథానాయికలు లావణ్యా త్రిపాఠీ, రీతూ వర్మతో పాటు మరో ఇద్దరు నటీమణులు కూడా ఉన్నారట. లావణ్యా త్రిపాఠీ, రీతూ వర్మ నిహారికకు మంచి స్నేహితులు. అలాగే పరిశ్రమ నుంచి ఇంకెవరు వెళ్లారో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    Also Read: అగ్నిప్రమాదంలో సినీ పెద్దల హస్తం ఉందా?

    ఇప్పటికే విమానంలో కుటుంబ సభ్యులందరూ దిగిన సెల్ఫీని వరుణ్‌తేజ్‌ సహా చైతన్య, నిహారిక కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. అన్నట్లు ఉదయ్‌ విలాస్‌ చేరుకున్న తర్వాత వధూవరులు చేసిన నృత్యం కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. మెగాస్టార్‌ కుటుంబం… చిరంజీవి, సురేఖ, రామ్‌చరణ్‌, ఉపాసన మరో ప్రత్యేక విమానంలో వెళ్లిన ఫోటోలు.. అలాగే తన తండ్రి చిరంజీవి స్కెచ్‌ ఫొటో మాస్క్‌ను ధరించిన రామ్‌చరణ్‌ ‘‘బాస్‌ మాస్క్‌’’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో బాగా వైరల్ అయ్యాయి. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత-విష్ణుప్రసాద్‌ దంపతులు, చిన్న కుమార్తె శ్రీజ- కల్యాణ్‌దేవ్‌ దంపతులు, చిరంజీవి మేనల్లుళ్లు సాయితేజ్‌, వైష్ణవ్‌తేజ్‌ సహా వాళ్ల తల్లిదండ్రులు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్