https://oktelugu.com/

Niharika Chaitanya : బిగ్ బ్రేకింగ్ : విడాకులు తీసుకున్న మెగా డాటర్ నిహారిక-చైతన్య దంపతులు

మార్చి 2023లో చైతన్య జొన్నలగడ్డ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నిహారికతో ఉన్న చిత్రాలను తొలగించినప్పుడు ఇదంతా ప్రారంభమైంది. ఇది బ్రేకప్ పుకార్లకు దారితీసింది. అయితే, నిహారిక అప్పటికి ఆ ఫొటోలను తొలగించలేదు. ఆ తర్వాత నిహారిక కూడా తమ చిత్రాలను తొలగించింది.

Written By:
  • NARESH
  • , Updated On : July 4, 2023 / 08:51 PM IST
    Follow us on

    Niharika Chaitanya : సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు నిలబడడం లేదు. ఊరికే పెటాకులవుతున్నాయి. నాగచైతన్య-సమంత విడాకుల విషయం తెలియగానే ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యింది. అందరూ ఈ మంచి జోడి విడిపోయినందుకు తెగ బాధపడ్డారు. ఇప్పుడు అచ్చం అలాగే మెగా డాటర్ నిహారిక-చైతన్య దంపతుల విడాకులు కూడా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.

    కొద్దికాలంగా దూరంగా ఉంటున్న నిహారిక-చైతన్య దంపతులు విడిపోయేందుకు సిద్ధమయ్యారు. వరుణ్ తేజ్ ఎంగేజ్ మెంట్ కూడా చైతన్య రాలేదు. వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు. ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పెళ్లి సహా కలిసి ఉన్న ఫొటోలు తీసేశారు.

    ఈ క్రమంలోనే మ్యూచువల్ అంగీకారంతో విడాకులు తీసుకునేందుకు మే 19న కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటీషన్ వేశారు.నిహారిక-చైతన్య జంట పరస్పర విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. విడాకుల ప్రక్రియ పూర్తయింది. విడాకుల డిక్రీ మంజూరైనట్లు సమాచారం. దీంతో ఈ జంట అధికారికంగా విడాకులు తీసుకున్నారు.

    అయితే ఈ జంట విడాకులు తీసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. కోలుకోలేని విభేదాలే ఈ జంట విడిపోవడానికి కారణమని ప్రచారం జరుగుతోంది.

    మార్చి 2023లో చైతన్య జొన్నలగడ్డ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నిహారికతో ఉన్న చిత్రాలను తొలగించినప్పుడు ఇదంతా ప్రారంభమైంది. ఇది బ్రేకప్ పుకార్లకు దారితీసింది. అయితే, నిహారిక అప్పటికి ఆ ఫొటోలను తొలగించలేదు. ఆ తర్వాత నిహారిక కూడా తమ చిత్రాలను తొలగించింది.

    ఇటీవల, చైతన్య జెవి గ్లోబల్ విపస్సనా పగోడా ధ్యాన కేంద్రంలో 10 రోజుల పాటు ధ్యానాన్ని అభ్యసించారు. విడాకులు ఇప్పుడు అధికారికం పూర్తి అయినా తర్వాత బాధతో ఓ పోస్ట్ చేశాడు.

    గ్లోబల్ విపాసనా పగోడా మెడిటేషన్ సెంటర్‌లో చైతన్య కనిపించాడు మరియు అతను సుమారు 10 రోజుల పాటు సెంటర్‌లో ధ్యానం చేశాడు. దీని గురించి అతను సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్‌ను ఉంచాడు. విడాకులతో డిస్ట్రబ్ అయ్యాడని.. అంతర్గత శాంతిలో ఇది ఎలా ప్రధాన పాత్ర పోషించింది.

    నిహారిక – చైతన్య ఇప్పుడు అధికారికంగా విడిపోయారు. వారి వివాహం ఇప్పుడు ముగిసిన అధ్యాయం.