Nidhhi Agerwal: 2017లో విడుదలైన సవ్యసాచి మూవీతో టాలీవుడ్ కి పరిచయమైంది నిధి అగర్వాల్. గ్లామర్ పరంగా సాలిడ్ గా ఉండే ఈ బోల్డ్ బ్యూటీకి అవకాశాలు వస్తున్నప్పటికీ హిట్స్ పడటం లేదు. నాగ చైతన్య హీరోగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన సవ్యసాచి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ నెక్స్ట్ మూవీ నాగచైతన్య తమ్ముడు అఖిల్ తో జతకట్టింది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మిస్టర్ మజ్ను కూడా విజయం సాధించలేదు. ప్లాప్స్ లో ఉన్నప్పటికీ నిధికి దర్శకుడు పూరి జగన్నాధ్ పిలిచి మరీ ఆఫర్ ఇచ్చాడు.

ఇస్మార్ట్ శంకర్ మూవీలో నిధి మెయిన్ హీరోయిన్ గా నటించారు. రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ భారీ విజయం సాధించింది. వరల్డ్ వైడ్ ఇస్మార్ట్ శంకర్ రూ. 75 కోట్ల గ్రాస్ రాబట్టింది. నిర్మాతలకు భారీగా లాభాలు పంచింది. ఇస్మార్ట్ శంకర్ మూవీతో నిధి ఫస్ట్ హిట్ ఖాతాలో వేసుకుంది. అయితే మరలా ఆమె పరాజయాల పరంపర కొనసాగింది. తమిళంలో చేసిన భూమి, ఈశ్వరన్ రెండు ఫ్లాప్ అయ్యాయి. ఇక ఈ ఏడాది సంక్రాంతి చిత్రాల్లో ఒకటైన హీరో చిత్రంలో నిధి నటించారు. అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన ఆ మూవీ ఆడలేదు.
ఐదేళ్ల ఈ జర్నీలో సక్సెస్ ఫార్ములా ఏమిటో చెప్పేసింది నిధి. హీరోయిన్స్ సక్సెస్ ప్యూర్ లక్ మీద బేస్ అవుతుందని చెప్పింది. హార్డ్ వర్క్, టాలెంట్ అంటా ట్రాష్ ని కొట్టిపారేసింది. నిధి మాట్లాడుతూ… పరిశ్రమలో అదృష్టమే కీలకం. పేపర్ మీద అద్భుతం అనిపించిన కథలు సిల్వర్ స్క్రీన్ పై నిరాశపరుస్తాయి. స్క్రిప్ట్ దశలో సాదా సీదా అనిపించిన కొన్ని కథలు సిల్వర్ స్క్రీన్ పై అద్భుతాలు చేయవచ్చు. కాబట్టి 90 శాతం సక్సెస్ లక్ మీదే ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చారు.

ఇక కథల ఆధారంగా సినిమాలు ఎంచుకునే స్థాయికి నేను ఎదగలేదని నిధి అగర్వాల్ నిర్మొహమాటంగా చెప్పింది. అయితే డిఫరెంట్ రోల్స్ చేయాలని, డాన్స్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించాలని ఉందని నిధి చెప్పుకొచ్చారు. ఇక తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటన పరంగా ఎలాంటి తారతమ్యాలు లేవు. మార్కెట్ లెక్కల్లో మాత్రమే వ్యత్యాసం ఉందన్నారు. కాగా నిధి చేతిలో ఉన్న భారీ చిత్రం హరి హర వీరమల్లు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది.