Nidhi Agarwal bold tweet: యూత్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు నిధి అగర్వాల్(Nidhhi Agerwal). ఈమె కెరీర్ లో చేసిన సినిమాలు తక్కువే, సూపర్ హిట్స్ ని కూడా చేతి వేళ్ళతో లెక్కపెట్టొచ్చు. కానీ క్రేజ్ మాత్రం మామూలు రేంజ్ లో ఉండదు. ఇన్ స్టాగ్రామ్ లో కానీ,ట్విట్టర్ లో కానీ ఈమె అప్లోడ్ చేసే ఫోటోలకు వేల సంఖ్యలో లైక్స్ వస్తుంటాయి. అంతే కాదు ఈమె అభిమానులతో కూడా చాలా కలివిడిగా మాట్లాడుతూ ఉంటుంది. అందుకే ఈమెకు యూత్ ఆడియన్స్ లో అంత క్రేజ్ ఏర్పడింది. అందరూ కోరుకునేది ఏమిటంటే ఈమెకు ఒక భారీ హిట్ తగిలి, స్టార్ హీరోయిన్ లీగ్ లోకి వెళ్లాలని. కానీ ఆ భారీ హిట్ నే తగలడం లేదు. ప్రస్తుతం ఈమె హీరోయిన్ గా నటించిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu), ‘రాజా సాబ్'(The Raja Saab) చిత్రాలు పూర్తి అయ్యాయి.
ఈ రెండు సినిమాల్లో ‘హరి హర వీరమల్లు’ చిత్రం వచ్చే నెల 24 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే విధంగా ప్రభాస్ తో చేసిన ‘రాజా సాబ్’ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 5 న విడుదల కాబోతుంది. ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశం రావడం అంత తేలికైన విషయం కాదు. ఆ అవకాశం ఈమెకు దక్కింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్స్ అయితే నిధి అగర్వాల్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. వరుసగా పాన్ ఇండియన్ సినిమాలతో ఫుల్ బిజీ గా మారిపోవచ్చు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా నిధి అగర్వాల్ వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
Guys.. I HAVE to watch a murder mystery every night can’t seem to find new content.. pls give me some suggestions….. any language is ok
— Nidhhi Agerwal Panchami (@AgerwalNidhhi) June 26, 2025
ఆమె మాట్లాడుతూ ‘ప్రతీ రోజు మర్డర్ మిస్టరీ కంటెంట్ సినిమాలు చూస్తున్నాను. ఇప్పుడు నాకు తెలిసినవన్నీ అయిపోయాయి. కొత్తవి దొరకడం లేదు. దయచేసి మీకు తెలిసిన సినిమాలు ఏవైనా ఉంటే కామెంట్ చేస్తారా?’ అని అడిగింది.ఆమె అడిగిన వెంటనే 500 కి పైగా కామెంట్స్ చేశారు. ఈ రేంజ్ రెస్పాన్స్ కేవలం హీరోయిన్స్ కి మాత్రమే వస్తుంది, అదే ఒక మామూలు హీరో ఇలాంటివి అడిగితే పట్టించుకోరు అంటూ సోషల్ మీడియా ల నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె వేసిన ట్వీట్ ని ఎక్సక్లూసివ్ గా మీకోసం క్రింద అందిస్తున్నాము, చూసి మీకు తెలిసిన మర్డర్ మిస్టరీ మూవీస్ ఏవైనా ఉంటే ఆమెకు చెప్పండి పాపం.