Nidhi Agarwal Temple: ఈ సినిమాతో ఈ అమ్మడి క్రేజ్ మరింత పెరుగుతుందని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలో క్యూట్ గా ఉన్న పాప టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. కెరియర్ ప్రారంభంలో హిందీ సినిమాతో హీరోయిన్గా అడుగుపెట్టినప్పటికీ ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్థిరపడింది ఈ యంగ్ బ్యూటీ. హిందీ తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తూ బిజీగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో తెలుగులో ఈ బ్యూటీ కి క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఇక త్వరలో ఈ బ్యూటీ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతమా ఆమె చేతిలో ఉన్న సినిమాలు. టాలీవుడ్ లో స్టార్ హీరోలతో ఈ క్రేజీ బ్యూటీ భారీ ప్రాజెక్టులలో హీరోయిన్గా నటిస్తుంది. పవన్ కళ్యాణ్ తో పాటు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో కూడా ఈ బ్యూటీ ప్రస్తుతం వెండి ఇతర పై నటిస్తుంది. త్వరలో పవన్ కళ్యాణ్ సినిమాతో ఈ బ్యూటీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ఈమె పేరు సామాజిక మాధ్యమాలలో తెగ ట్రెండ్ అవుతుంది.
ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు హరిహర వీరమల్లు సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న నిధి అగర్వాల్. సినిమా రిలీజ్ సమీపిస్తుండడంతో నిధి అగర్వాల్ కు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు సామాజిక మాధ్యమాలలో వినిపిస్తున్నాయి. ఈమె హైదరాబాదులో పుట్టి పెరిగిన తెలుగు అమ్మాయి. చదువు మధ్యలో ఉన్న సమయంలోనే నటనపై తనకున్న ఇష్టంతో మొదట మోడలింగ్ రంగంలో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో అక్కినేని నాగచైతన్య హీరోగా కనిపించిన సవ్యసాచి అనే సినిమాతో హీరోయిన్గా నిధి అగర్వాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమాలో కూడా కనిపించింది.
రామ్ పోతినేని సరసన నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మొదటి హిట్ తన ఖాతాలో వేసుకుంది. తమిళ్లో నిధి అగర్వాల్ శింబు, రవి మోహన్ వంటి స్టార్ హీరోలతో కూడా కలిసి నటించింది. కానీ గత కొన్ని ఏళ్ల నుంచి నిధి అగర్వాల్ కు సరైన బ్రేక్ లేదు. దీంతో ఈ బ్యూటీ ఆశలన్నీ కూడా త్వరలో రిలీజ్ కాబోతున్న పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు, అలాగే ప్రభాస్ సినిమా ది రాజా సాబ్ మీదనే ఉన్నాయి. హరిహర వీరమల్లు సినిమా జూన్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నిధి అగర్వాల్ అందానికి మైమరచిపోయి అభిమానులు చెన్నైలో నిధి అగర్వాల్ కు ఏకంగా గుడి కూడా కట్టి పూజిస్తున్నారు.
The heat has landed!
Volume max…vibe max! #TaaraTaara – The sizzling single from #HariHaraVeeraMallu is out now!A @mmkeeravaani Musical
✍️ @SriharshaEmani #AbbasTyrewala @pavijaypoet @Aazad_Varadaraj #MankombuGopalakrishnan
️… pic.twitter.com/emhNgW9ahE— Nidhhi Agerwal Panchami (@AgerwalNidhhi) May 28, 2025