https://oktelugu.com/

Nidhi Agarwal: ‘ఇస్మార్ట్’గా రెమ్యునరేషన్ పెంచేసిన నిధి అగర్వాల్..!

Nidhi Agarwal: ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ టాలీవుడ్లో వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. స్టార్ హీరోలు, కొత్త హీరోలు అనే తేడా లేకుండా వచ్చిన అవకాశాలను ఈ భామ సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళుతోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో టాలీవుడ్లో భారీ విజయం అందుకున్న ఈ భామ ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడింది. నిధి అగర్వాల్ కు తెలుగులోనే కాకుండా తమిళంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఈ భామకు ఏకంగా అభిమానులు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 29, 2022 / 12:28 PM IST
    Follow us on

    Nidhi Agarwal: ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ టాలీవుడ్లో వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. స్టార్ హీరోలు, కొత్త హీరోలు అనే తేడా లేకుండా వచ్చిన అవకాశాలను ఈ భామ సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళుతోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో టాలీవుడ్లో భారీ విజయం అందుకున్న ఈ భామ ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడింది.

    Nidhi Agarwal

    నిధి అగర్వాల్ కు తెలుగులోనే కాకుండా తమిళంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఈ భామకు ఏకంగా అభిమానులు గుడిని కట్టారు. కెరీర్ తొలినాళ్లలో బాలీవుడ్లో సినిమాల్లో నటించిన నిధి అగర్వాల్ ఆ తర్వాత టాలీవుడ్ వైపు అడుగులు వేసింది. ‘అఖిల్’ హీరోగా నటించిన ‘మిస్టర్ మజ్ను’లో నటించింది. ఆ తర్వాత నాగచైతన్యతో ‘సవ్యసాచి’లో నటించింది.

    ఈ రెండు సినిమాలు కూడా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. ఇలాంటి సమయంలో పూరి జగన్మాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’లో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నిధి అగర్వాల్ కు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి. మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ నటించిన ‘హీరో’ మూవీలో నిధి నటించింది. ఈ మూవీ రీసెంట్ గా రిలీజైంది.

    ఈ సినిమాకు ముందు 50 నుంచి 80లక్షల పారితోషికం తీసుకునే నిధి అగర్వాల్ ‘హీరో’ కోసం ఏకంగా రెండు కోట్ల తీసుకుందని టాక్. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘హరిహరవీరమల్లు’లోనూ నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ మూవీ కోసం కోటికిపైగానే పారితోషికం అందుకుంటుందట. ఈ మూవీ హిట్ అయితే ఈ భామ మరింత రెమ్యూనరేష్ పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ భామ తమిళంలో శింబుతో ప్రేమయాణం నడిపిస్తుందనే గాసిప్స్ విన్పిస్తున్నాయి.