https://oktelugu.com/

పాపం దురదృష్టం అంటే ఆమెదే.. ఎంత చూపించినా !

దురదృష్టం అంటే నిధి అగర్వాల్ దే. గ్రాండ్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ప్రస్తుతం చిన్నాచితకా సినిమాల కోసం కూడా తాపత్రయ పడాల్సి వస్తోంది. నిజానికి నిధి అగర్వాల్ ఫోటోలు, వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. స్వతహాగా గ్లామరస్ బ్యూటీ కావడం, దానికి తోడు ఎక్కడ ఏమి చూపించాలో నిధికి బాగా తెలియడంతో ఆమె నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటుంది. నిజానికి నిధి అగ‌ర్వాల్ […]

Written By:
  • admin
  • , Updated On : May 2, 2021 / 02:07 PM IST
    Follow us on

    దురదృష్టం అంటే నిధి అగర్వాల్ దే. గ్రాండ్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ప్రస్తుతం చిన్నాచితకా సినిమాల కోసం కూడా తాపత్రయ పడాల్సి వస్తోంది. నిజానికి నిధి అగర్వాల్ ఫోటోలు, వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. స్వతహాగా గ్లామరస్ బ్యూటీ కావడం, దానికి తోడు ఎక్కడ ఏమి చూపించాలో నిధికి బాగా తెలియడంతో ఆమె నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటుంది.

    నిజానికి నిధి అగ‌ర్వాల్ దిశ‌, ద‌శ‌ను ఇస్మార్ట్ శంక‌ర్‌ సినిమా మార్చేసింది అనుకున్నా.. ఆ సినిమా హిట్ ఎఫెక్ట్‌, నిధికి పెద్దగా ఉపయోగపడలేదు. మరోపక్క అవకాశాల కోసం నిధి హాట్ ఫోటో షూట్స్ కూడా చేయాల్సి వచ్చింది. ఆ హాట్ ఫోటోలు చూసి, నిధికి అమాంతం ఫాలోవ‌ర్లు పెరిగారు గాని, సినిమా ఆఫర్లు మాత్రం రాలేదు. ఆఫర్లు రాకపోయినా.. త‌న అభిమానుల్ని మాత్రం నిధి ఎప్పుడూ నిరుత్సాహ‌ప‌ర‌చ‌లేదు.

    తన ఫ్యాన్స్ కోసం ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌దైన శైలిలో గ్లామర్ ను ఒలకబోస్తూ పైగా డిఫరెంట్ డిఫరెంట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ వాటిని సోష‌ల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ నెటిజన్లను ఇప్పటికీ ఎంట‌ర్‌ టైన్ చేస్తూనే ఉంది. త‌న‌కు వచ్చే చిన్నాచితకా చిత్రాలకు సంబంధించి అప్‌ డేట్స్ ను కూడా రెగ్యులర్ గా అభిమానుల‌తో షేర్ చేసుకుంటూనే ఉంది. ఆ మధ్య ఓ నెటిజన్ మీరు ఎందుకు కావాలని ఎక్స్ పోజింగ్ చేస్తున్నారు అంటూ అవమానించినా..

    నిధి మాత్రం తన అందాల సేవను కంటిన్యూ చేస్తూనే ఉంది. పైగా కొత్త రకం యాంగిల్స్‌ లో స్టిల్స్ తీయించుకుని.. కుర్ర‌కారును క‌వ్విస్తూ, తన మ‌త్తెక్కించే క‌ళ్ల‌తో మైమరిపించే ఓర చూపులతో తరుచూ సోష‌ల్ మీడియాను దర్శనం ఇస్తూనే ఉంది. ఇంత చేసినా ఛాన్స్ లు రావడం లేదు. ట్రెండీ కాస్ట్యూమ్స్ లో హద్దులు దాటుతున్నా, తనకు ఎందుకు ఆఫర్లు రావడం లేదు అని పాపం నిధి అగర్వాల్ బాధ పడుతుంది. చివరకు యాడ్స్ కోసం కూడా పైరవీలు చేయాల్సి వస్తోంది.