Nidhi Agarwal: సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే హీరోయిన్స్ లో నిధి అగర్వాల్ కూడా ఒకరు. సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, వంటి చిత్రాల్లో తన నటనతో అభిమానులను ఆకర్షించారు నిధి. అలానే సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ… హాట్ పిక్స్ లో యువకుల మనసుల్ని దోచుకుంటుంది ఈ భామ. అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే చాన్స్ దక్కించుకోవడంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది అనే చెప్పాలి.
ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో ఫుల్ ఫాలోయింగ్ తో దూసుకుపోతూ… ఫాలోవర్స్ ను పెంచుకుంటూ సాగుతుంది. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నిధి అగర్వాల్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య 12.9 మిలియన్స్ కు చేరుకుంది. కోలీవుడ్‌లో కూడా వరుస ఆఫర్లను దక్కించుకుంటుంది నిధి. హీరో జయం రవితో కలిసి ‘భూమి’ చిత్రంలో నటించగా … ఆ తర్వాత శింబుతో కలిసి ‘ఈశ్వరన్’ చిత్రంలో నటించింది. ఈ సినిమా మంచి హిట్ ను అందుకుంది.
ప్రస్తుతం నిధి అగర్వాల్ కి టాలీవుడ్, కోలీవుడ్‌లో ఇప్పుడు మంచి డిమాండ్ చెప్పాలి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ నటిస్తున్న మూవీకి “హరి హర వీరమల్లు” అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ కి సంబంధించిన పోస్టర్స్, ఫస్ట్ లుక్ వీడియో లకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలానే గల్లా అశోక్ తో జోడీగా నటిస్తున్న ” హీరో ” సినిమా షూటింగ్ దశలో ఉంది.