https://oktelugu.com/

పొద్దున్నే అది తాగనిదే నిధి అగర్వాల్ రోజు మొదలుపెట్టదట?

నిధి అగర్వాల్.. చూడగానే అసలు సిసలు హీరోయిన్ లక్షణాలన్నీ ఈ అమ్మడులో కనిపిస్తుంటాయి. బ్రహ్మదేవుడు కరెక్ట్ మూడ్ లో ఉండగా ఈ అందాన్ని పోతపోశాడా? అన్నట్టుగా అనుమానం కలుగక మానదు. అయితే ఈ అందాల రాశికి ఎందుకో సినిమాల్లో అంతగా అవకాశాలు దక్కడం లేదు. ఆ మధ్య వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలతో తప్పితే ఈ అమ్మడు మెరిసింది లేదు. అయితే ఇన్ స్టాగ్రామ్ లో నిధి అగర్వాల్ అందాల ఆరోబోత మాత్రం తగ్గడం లేదు. ఆమె […]

Written By:
  • NARESH
  • , Updated On : September 25, 2021 / 05:24 PM IST
    Follow us on

    నిధి అగర్వాల్.. చూడగానే అసలు సిసలు హీరోయిన్ లక్షణాలన్నీ ఈ అమ్మడులో కనిపిస్తుంటాయి. బ్రహ్మదేవుడు కరెక్ట్ మూడ్ లో ఉండగా ఈ అందాన్ని పోతపోశాడా? అన్నట్టుగా అనుమానం కలుగక మానదు. అయితే ఈ అందాల రాశికి ఎందుకో సినిమాల్లో అంతగా అవకాశాలు దక్కడం లేదు. ఆ మధ్య వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలతో తప్పితే ఈ అమ్మడు మెరిసింది లేదు.

    అయితే ఇన్ స్టాగ్రామ్ లో నిధి అగర్వాల్ అందాల ఆరోబోత మాత్రం తగ్గడం లేదు. ఆమె అందం, చందానికి తగ్గట్టే ఏకంగా 12 మిలియన్ల మంది ఫాలోవర్లు ఆమె వెంట ఉన్నారు. ఈ క్రమంలోనే తనకు ఇంత అభిమానులు ఉండడంతో ఉప్పొంగిపోయిన నిధి అగర్వాల్ తాజాగా ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఓ సీక్రెట్ చెబుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే తన రెండు సీక్రెట్లను బయటపెట్టింది. ఒకటి తన గోర్లు, రెండోది తన జుట్టు. వీటికి సంబంధించిన సీక్రెట్లను బయటపెట్టింది. ఇక తన సౌందర్యాన్ని కాపాడుకునేందుకు వాడే ఉత్పత్తుల గురించి ప్రమోట్ చేసుకుంది.

    తాజాగా నిధి అగర్వాల్ మూడో సీక్రెట్ బయటపెట్టింది. తాను రోజు ఉదయాన్నే ‘నిమ్మకాయ వేడినీళ్లు’ తాగుతాను ని చెప్పింది.ఇది సహజసిద్ధమైన వెనిగర్ లాంటిదని తెలిపింది. మన జీర్ణశక్తిని ఇది పెంచుతుందని వివరించింది. రోజంతా కూడా ఎనర్జీతో ఉండేందుకు సహాయపడుతుందని నిధి తన ఆరోగ్య రహస్యాన్ని రివీల్ చేసింది.

    సోషల్ మీడియాలో అస్సలు యాక్టివ్ గా ఉండడం లేదని అభిమానులు గోలపెట్టడంతో ఈ మధ్య ఈ అమ్మడు పోల్ పెట్టింది. తాను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించింది. దీనికి దాదాపు 93శాతం మంది అవునంటూ సమాధానం ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి 12 మిలియన్ల ఫాలోవర్స్ కోసం రోజుకో సీక్రెట్ చెబుతూ సందడి చేస్తుంది.