Nidhhi Agerwal: హీరోయిన్ గా ఎంట్రీలోనే చైతు, అఖిల్ తో వరుసగా సినిమాలు చేసింది నిధి అగర్వాల్. ఆ తర్వాత కూడా అమ్మడుకి అవకాశాలు క్యూ కట్టాయి. అయితే, మధ్యలో చేసిన ఓ పొరపాటు కారణంగా.. అలాగే చేసిన మొదటి రెండు సినిమాలు డిజాస్టర్ల కారణంగా మొత్తానికి నిధికి ఏ మాత్రం కలిసి రాలేదు. దాంతో రోజులు గడిచే కొద్దీ కనీస అవకాశాలు కూడా రాలేదు.

దాంతో నిధి అగర్వాల్ లో చాలా మార్పులు వచ్చాయి. ఛాన్స్ ల కోసం ఆమె ఎక్స్ పోజింగ్ లో రోజురోజుకు పరిధి దాటుతూ ముందుకు పోయింది. ఈ క్రమంలో కొన్ని చిన్నాచితకా చిత్రాల్లో ఆమెకు అవకాశాలు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. అయితే, నటన పరంగా మాత్రం నిధి పెద్దగా అభివృద్ధి చెందలేదని ఆమెతో సినిమాలు చేసినవాళ్లు చెబుతున్నారు.
హీరోయిన్ అంటే.. నిధి దృష్టిలో కేవలం ఎక్స్ పోజింగే అని, ఈమె కేవలం తన గ్లామర్ నే నమ్ముకొంది అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తమ్మీద నిధి నిజంగానే తనలోని అందాల నిధులను పరుస్తూ పోతుంది తప్ప, నటనతో ఆకట్టుకోవాలి అనే కోణంలో మాత్రం ఆలోచించలేకపోతుంది. అందుకే, ఈ అందాల భామ చేతిలో సినిమాలు తక్కువ ఉన్నాయి.
సినిమాలు తగ్గుతున్న కొద్దీ అందాల ఆరబోతతో నిధి ఇన్ స్టాగ్రామ్ పై యుద్దానికి దిగుతుంది. అయినా ఎన్ని యుద్దాలు చేసినా ఏం ఉపయోగం ? ఇప్పటివరకు నిధి అగర్వాల్ నటించిన సినిమాలేవీ విజయం సాధించలేదు కదా. ఒక్కటి మాత్రం నిధికి బాగా తెలుసు. గ్లామర్ నే పెట్టుబడిగా పెట్టి కెరీర్ ని కాపాడుకోవడం ఎలాగో నిధికి బాగా తెలుసు.
ఇక నిధి అటు తమిళంలో కూడా కొన్ని చిత్రాలు చేసింది. అందాల ఆరబోతలో అక్కడ కూడా అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయింది. కానీ ఎందుకో తమిళంలో కూడా నిధికి పెద్దగా క్రేజ్ రాలేదు. ఇక నిధి కెరీర్ లో చెప్పుకోతగ్గ సినిమా అంటే… పవన్ కళ్యాణ్ సరసన ‘హరి హర వీరమల్లు’ సినిమానే. ఈ సినిమాలో ఆమె లో మెయిన్ హీరోయిన్.
Also Read: Kaikala Satyanarayana: కైకాల ఇప్పుడు బాగానే ఉన్నారు.. అసత్య ప్రచారాలు నమ్మొద్దు- కైకాల కుమార్తె