Homeఎంటర్టైన్మెంట్Unstoppable Season-2: బాలయ్య ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్... అన్ స్టాపబుల్ సీజన్ 2...

Unstoppable Season-2: బాలయ్య ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్… అన్ స్టాపబుల్ సీజన్ 2 వచ్చేస్తుంది

Unstoppable Season-2: దెబ్బకు థింకింగ్ మారిపోలా అంటూ అన్ స్టాపబుల్ టాక్ షోలో బాలయ్య చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. నిజంగానే ఈ షో తర్వాత బాలయ్య పట్ల థింకింగ్ పూర్తిగా మారిపోయింది. టాక్ షోకి హోస్ట్ గా బాలయ్య అనగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. షో అట్టర్ ప్లాప్ కావడం ఖాయం అనుకున్నారు. దానికి భిన్నంగా అన్ స్టాపబుల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. నేషనల్ వైడ్ హాట్ టాపిక్ గా బాలయ్య టాక్ షో నిలిచింది. ఈ షోని సరికొత్తగా రూపొందించడం కూడా కలిసొచ్చింది. సాధారణంగా సెలబ్రిటీలతో టాక్ షో అంటే ఏదో వాళ్ళ గొప్పలు చెప్పుకుంటూ డిప్లొమాటిక్ గా లాగించేస్తారు.

Unstoppable Season-2
Ballaya Babu

అన్ స్టాపబుల్ షో అలా సాగలేదు. చాలా బోల్డ్ కంటెంట్ తో నడిచింది. మందు, చిందు దగ్గర నుండి అనేక పర్సనల్ విషయాలు చర్చకు వచ్చేవి. గెస్ట్స్ గా వచ్చిన స్టార్స్ జీవితాల్లో ఉన్న వివాదాలు, వాటి వెనకున్న నిజాలు చర్చించడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాయి. బాలయ్య సైతం తమ కుటుంబం గురించి సమాజంలో చలామణి అవుతున్న కొన్ని పుకార్లను తెరపైకి తెచ్చి చర్చించడం జరిగింది. ఫస్ట్ సీజన్ లో మోహన్ బాబు, మహేష్, రవితేజ, రానా, రాజమౌళి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి అనేక మంది స్టార్స్ గెస్ట్స్ వచ్చారు.

Also Read: Lady Power Star Saipallavi Reaction: వాటికి కనెక్ట్ కాను… లేడీ పవర్ స్టార్ బిరుదుపై సాయి పల్లవి రియాక్షన్!

సీజన్ 1 సక్సెస్ నేపథ్యంలో సీజన్ 2 కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ నిరీక్షణకు తెర పడే సమయం ఆసన్నమైంది. అన్ స్టాపబుల్ సీజన్ 2 త్వరలో ప్రారంభం కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. షూటింగ్ త్వరలో మొదలు కానుండగా ఫస్ట్ ఎపిసోడ్ సరికొత్తగా సిద్ధం చేస్తున్నారు. సెకండ్ సీజన్ లో మెగా, నందమూరి కుటుంబాల నుండి స్టార్స్ వచ్చే అవకాశం కలదు. బాలయ్య షోకి చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ రావాల్సి ఉంది. వారందరూ సీజన్ 2 లో పాల్గొంటే మాములుగా ఉండదు. అన్ స్టాపబుల్ టాక్ షో తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహా లో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.

Unstoppable Season-2
Aha Show Unstoppable 2

ఇక అఖండ మూవీతో భారీ హిట్ కొట్టిన బాలయ్య ఫుల్ ఖుషీలో ఉన్నారు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా దసరా బరిలో దిగే ఆస్కారం కలదు. ఈ మూవీలో బాలయ్యకు జంటగా శృతి హాసన్ నటిస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకుని విడుదల చేసిన ఫస్ట్ గ్లిమ్ప్స్ దుమ్ము రేపింది. ఈ చిత్రం తర్వాత బాలయ్య దర్శకుడు అనిల్ రావిపూడితో మూవీ ప్రకటించారు. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

Also Read: Pavan Kalyan: జగన్, బాబులను బీట్ చేయాలంటే పవన్ ఏం చేయాలి..?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular