Actor Sunil: నటుడు సునీల్ గురించి ఎంత చెప్పిన తక్కువ అనే చెప్పాలి. టాలీవుడ్ లో కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు సునీల్. చాలా కాలం పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ నటుడు ఓ వెలుగు వెలిగాడు. బ్రహ్మానందం, ఎం ఎస్ నారాయణ లాంటి కామెడియన్లకు బలమైన పోటీ ఇచ్చాడు సునీల్. కొంతకాలం తర్వాత సునీల్ హీరోగా అవకాశాలు వచ్చాయి. ప్రారంభంలో విజయాలు కూడా దక్కాయి. దీనితో సునీల్ కామెడీ రోల్స్ కి స్వస్తి చెప్పి ఫుల్ టైం హీరోగా టర్న్ తీసుకున్నాడు. కానీ సునీల్ హీరోగా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా బోల్తా కొడుతూ వచ్చాయి. కొన్ని రోజులకు హీరోగా సునీల్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. దీనితో సునీల్ ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్, విలన్ పాత్రలు, కామెడీ రోల్స్ చేస్తున్నాడు.
అయితే సునీల్ హీరోగా ‘వేదాంతం రాఘవయ్య’ అనే చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ సంస్థ ప్రకటించింది. కొన్ని నెలల క్రితమే ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఈ ప్రకటనను చేసింది చిత్ర బృందం. ఈ మూవీకి ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కథ అందిస్తున్నారు. సి.చంద్రమోహన్ ఈ చిత్రానికి దర్శకుడు. తాజాగా ఈ చిత్రం గురించి ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. పలు కారణాల రీత్యా ఈ చిత్రం నుంచి సునీల్ తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో మేకర్స్ సునీల్ ప్లేస్ లోకి యువ నటుడు సత్యదేవ్ ని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. అయితే సునీల్ ఈ చిత్రం నుంచి ఎందుకు తప్పుకున్నారు అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సునీల్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో సునీల్ విభిన్నమైన గెటప్ లో కనిపించబోతున్నాడు.
We are very Happy & Thrilled to announce our next project titled #VedanthamRaghavaiah. Starring everyone's favourite actor @Mee_Sunil with Story by the blockbuster director @harish2you.
More details soon… pic.twitter.com/Pl2DZxZI2y
— 14 Reels Plus (@14ReelsPlus) August 31, 2020
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: News circulating on social media that sunil leaving vedhantham raghavayya movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com