Homeఎంటర్టైన్మెంట్Bagmati Flood: బీహార్ లో భాగమతి బీభత్సాన్ని వర్ణిస్తూ లైవ్ లో నవ్విన యాంకర్…ఫైర్ అవుతున్న...

Bagmati Flood: బీహార్ లో భాగమతి బీభత్సాన్ని వర్ణిస్తూ లైవ్ లో నవ్విన యాంకర్…ఫైర్ అవుతున్న నేటిజన్స్..

Bagmati Flood: ప్రస్తుతం బీహార్ లో భాగమతి నది ఉగ్రరూపం దాల్చింది.. వరద బీభత్సానికి జనాలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇలాంటివి చూసినా విన్నా మనకే అయ్యో అనిపిస్తుంది.. అలాంటిది లైవ్ టెలికాస్ట్ లో ఈ వార్తల గురించి చెబుతున్న ఒక యాంకర్.. మధ్యలో పుసుక్కున నవ్వింది. ఇంత సీరియస్ విషయం చెబుతూ ఉంటే నవ్వు ఎలా వస్తుంది.. అని నెటిజన్లు ప్రస్తుతం ఆ యాంకర్ ని తిట్టిపోతున్నారు.

ఒకపక్క జనాలు ప్రాణం కోసం అల్లాడుతుంటే ఇటువంటి పరిస్థితుల్లో నీకు నవ్వు ఎలా వస్తుంది…అసలు నువ్వు మనిషివేనా…అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. అసలు ఇంతకీ జరిగింది ఏమిటంటే…. బీహార్ లో భాగమతి నది పొంగిపొర్లుతూ…వరద సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వరద దాటికి గ్రామాలకు గ్రామాలు మునగడంతో జనాలు నిరాశ్రయులయ్యారు. కటిక గుండెను సైతం కరిగించే ఈ కన్నీటి గాధ చదువుతున్న యాంకర్ కి మాత్రం వినోదంగా మారింది.

ఓ న్యూస్ ఛానల్ కు సంబంధించిన యాంకర్ …బీహార్ ప్రజలు ఎదుర్కొంటున్న భయంకర పరిస్థితులను వివరిస్తూ…మధ్యలో నవ్విన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. లైవ్ టెలికాస్ట్ లో వార్తలు చదువుతున్న ఆ సదరు యాంకరమ్మ..ఒక పదాన్ని సరిగ్గా ఉచ్చరించలేక తప్పు పలికింది. పలికితే పలికింది ..కాస్త కవర్ చేసి వార్తలు కంటిన్యూ చేస్తే పరువైన దక్కేది…కానీ తన తప్పుకు తానే నవ్వుతూ రియాక్ట్ అయింది.

మామూలు సందర్భాలలో అయితే ఇది పెద్ద తప్పుగా పరిగణించబడేది కాదు. కానీ అవతల ఆమె చదువుతున్న మ్యాటర్ యొక్క సీరియాసిటీ అలాంటిది…అటువంటి హృదయ విధారకమైనటువంటి వార్తలు చదువుతున్నప్పుడు.. అది కూడా లైవ్ టెలికాస్ట్ అయినప్పుడు…ఇలాంటి చిన్న తప్పులు పెను ప్రమాదాలుగా మారక తప్పదు కదా.

పాపం ఈ యాంకర్ విషయంలో కూడా ప్రస్తుతం అదే జరిగింది. బీహార్ రాష్ట్రం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇటువంటి సమయంలో వార్తల కవరేజీ ఇస్తూ ఆమె అలా నవ్వడం జనాలు జీర్ణించుకోలేక పోయారు. ఇందులో ఆమె ఉద్దేశపూర్వకంగా చేసింది ఏమీ లేనప్పటికీ…మరి అంత ఒళ్ళు తెలియకుండా నవ్వుతున్నావు ఏంటమ్మా.. అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఆమె చేసిన పనిని తప్పుగా అర్థం చేసుకున్న కొందరు నెటిజెన్లు మాత్రం…భాగమతి నది వరద బీభత్సాన్నే కాక నవ్వులు దగ్గులు కూడా తెప్పిస్తోంది అని వెటకారంగా చురకలం అంటిస్తున్నారు.

సోషల్ మీడియాలో జరుగుతున్న మాస్ ర్యాగింగ్ తట్టుకోలేక పాపమా యాంకర్ ‘మాఫ్ కీజీయేగా’ అంటూ తన భాషలో క్షమాపణలు కూడా చెప్పుకుంది. ఆ యాంకర్ నవ్విన వీడియోతో పాటు ప్రస్తుతం ఆమె క్షమాపణలు చెప్పిన వీడియోస్ ఐటం సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఇదిలా ఉంటే పాపం బీహార్ లోని ముజఫర్‌పూర్ జిల్లాలో సుమారు 30 మంది పిల్లలు ఉన్న ఒక పడవ నదిలో బోల్తాపడగా వారిలో ఇంకా 12 మంది పిల్లల ఆచూకీ కూడా తెలియలేదు

Bathini Surendar
Bathini Surendarhttp://oktelugu
Bathini Surendar is a Journlist and content writer with good Knowledge on News Writing. He is experience in writing stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular