
స్వీటీ అనుష్కకి సినిమాల్లోకి రాకముందే పెళ్లి చేయాలనుకున్నారట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. కానీ అంతలో అనుష్క సినిమాల్లోకి రావడం.. తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోవడంతో ఆమె కెరీర్ చూసేలోపే చాల ముందుకు వచ్చేసింది. తెలియకుండానే అనుష్క వయసు కూడా బాగా పెరిగిపోయింది. అందుకే అనుష్క పెళ్లి మీద సోషల్ మీడియాలో చాలా రూమర్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇంతవరకూ అనుష్క పెళ్లి పై మాత్రం ఎవ్వరికీ క్లారిటీ రాలేదు. అయితే మరోసారి అనుష్క త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కోలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. వినయ్ శెట్టి అనే తమ దగ్గరి బంధువును అనుష్క పెళ్ళి చేసుకోబోతుందని ఆ వార్త సారాంశం.
Also Read: ఉపాసన కోసం చెఫ్ గా మారిన సమంత
ఇప్పటికే ఎన్నో సార్లు అనుష్క డేటింగ్ లో ఉన్నట్లు రూమర్లు వచ్చాయి. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ తో అనుష్క ప్రేమలో ఉన్నట్లు ఏళ్ళ తరబడి గాసిప్పులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ విషయం పై ప్రభాస్ తో పాటు అనుష్క కూడా మా మధ్య ప్రేమ ఏమి లేదు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా.. ఆ రూమర్లు మాత్రం ఆగలేదు. అయితే తాజాగా అనుష్క పెళ్లికి సిద్ధమవుతునట్లు ఓ రూమర్ బాగా వైరల్ అవుతొంది. ఇప్పటికే ఆమె కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నట్లు.. త్వరలోనే పెళ్లికి సంబంధించిన అప్ డేట్ ను కూడా అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే అనుష్క కూడా కొత్త సినిమాలు ఒప్పుకోవట్లేదు.
Also Read: బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా?
లాక్ డౌన్ కి ముందు కూడా అఫీషియల్ గా అనుష్క ఇంతవరకు వేరే సినిమాలకు సైన్ చేసినట్లు ప్రకటన కూడా రాలేదు. అలాగే కథలు వినడానికి కూడా అనుష్క పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదట. నిజానికి సూర్య – హరి కలయికలో వస్తోన్న సినిమాకి మొదట అనుష్కను హీరోయిన్ గా అనుకున్నారు. సింగం సిరీస్ లో ఎలాగూ అనుష్కనే హీరోయిన్ కాబట్టి.. ఆమె కూడా ఈ సినిమా చేస్తోందనుకున్నారు. కానీ సూర్య సినిమాని అనుష్క ఒప్పుకోలేదు. కేవలం పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే అనుష్క సినిమాలు తగ్గించిందని చాల బలంగా వినిపిస్తోంది. మరి ఈ సారైనా అనుష్క పెళ్లి బాజా మోగుతాయేమో చూడాలి.