Sharwanand: యంగ్ హీరో శర్వానంద్, నేషనల్ క్రష్ రష్మిక ప్రధాన పాత్రలలో… ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా తెరకెక్కుతుంది. నేను… శైలజ’ తో క్లాసికల్ హిట్ అందుకున్న డైరెక్టర్ కిశోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. శర్వాతో ‘పడి పడి లేచె మనసు’ చిత్రాన్ని నిర్మించిన సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విజయదశమి సందర్భంగా చిత్ర యూనిట్ తాజాగా ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది.

ఇందులో శర్వానంద్ రష్మిక తెలుగు సాంప్రదాయం లో కనిపిస్తారు ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే టైటిల్ తో ప్రేక్షకులను అలరించబోతోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ చిత్రానికి సుజిత్ సారంగ్మ కెమెరా మెన్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ లో ముందుగా విక్టరీ వెంకటేష్ ను హీరోగా అనుకున్నప్పటికీ… శర్వానంద్ శైలికి తగ్గట్టు కథ, స్క్రీన్ ప్లేలో మార్పులు చేశారని టాక్ వినిపిస్తుంది.
ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ల జోరు ఎక్కువగా కనిపిస్తోంది. ఇందులో సీనియర్ నటీమణులు.. రాధిక .. ఉర్వశి .. ఖుష్బూ ముఖ్యమైన పాత్రల్లో సందడి చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నిన్న దసరా కానుకగా శర్వానంద్, సిద్దార్థ్ ప్రధాన పాత్రలలో నటించిన మహా సముద్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఇందులో అను ఇమాన్యూయేల్, అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటించారు. ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాని డైరెక్ట్ చేశారు.