Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా “పుష్ప”. సుకుమార్ తొలిసారిగా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. కాగా రెండు బాగాలుగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగం పుష్ప – ది రైజ్ ని డిసెంబర్ 17 న భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించనుంది.

ఇందులో రష్మిక హీరోయిన్గా కనిపించనుంది. కాగా స్టార్ హీరోయిన్ సమంత ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్న సంగతి అందరికీ తెలిసిందే. డిసెంబరు 6న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ పై ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.
Also Read: నార్త్‌లో పుష్పరాజ్ సందడి షురూ.. ప్రమోషన్స్‌కు సర్వం సిద్ధం
అయితే ప్రస్తుత కాలంలో సినిమాని ప్రమోట్ చేసేందుకు టైటిల్ నుండి టీజర్ వరకు ఒకటి తర్వాత ఒకటి విడుదల చేస్తూ అభిమానుల్లో అంచనాలు పెంచేస్తున్నారు చిత్ర బృందం. ఈ తారాలోనే పుష్ప టీమ్ కూడా రిలీజ్ దగ్గర పడుతుండడంతో వరుస అప్డేట్ లను ఇస్తూ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ పోస్టర్లను రిలీజ్ చేస్తూ భారీగా హైప్స్ పెంచుతుంది మూవీ యూనిట్. ప్రస్తుతం ఈ పోస్టర్లు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. మైత్రీ మూవీ మేకర్స్ – ముత్తం శెట్టి మీడియా కలిసి దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ గా చేస్తుండగా… సునీల్, అనసూయ భరద్వాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
Who's excited to see @alluarjun's fiery new avatar in #PushpaTheRise 🔥#AlluArjun #Bunny #Tollywood #TollywoodActor #Pushpa #PushpaTrailer #RashmikaMandanna #FahadhFaasil #PushpaRaj pic.twitter.com/BzoR5m94In
— Hyderabad Times (@HydTimes) December 3, 2021
Also Read: ఏపీ వరద బాధితులకు అండగా అల్లుఅర్జున్.. భారీ విరాళం ప్రకటన