Netizens trolls on Allu Arjun daughter: మన టాలీవుడ్ లో ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అలా వైకుంఠపురం లో మరియు పుష్ప వంటి భారీ సెన్సషనల్ హిట్స్ తో ప్రస్తుతం ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉన్నాడు అల్లు అర్జున్..ముఖ్యంగా పుష్ప సినిమాతో ఆయన ఇతర ప్రాంతీయ బాషలలో కూడా జెండా పాతేసాడు..రాజమౌళి తర్వాత ఇతర బాషలలో ప్రస్తుతం విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న ఏకైక తెలుగు స్టార్ అల్లు అర్జున్ మాత్రమే..సాధారణంగా ఏ స్టార్ హీరో అయినా ఎదుగుతున్న సమయం లో అభిమానులు ఎంతలా అయితే పుట్టుకొస్తారో, దురాభిమానులు కూడా అదే స్థాయిలో పుట్టుకొస్తారు..అల్లు అర్జున్ కి కూడా ఆన్లైన్ లో పాసిటివిటీ తో పాటుగా నెగటివిటీ కూడా గట్టిగానే ఉంటుంది..కొన్ని కొన్ని సందర్భాలలో ఆయన ఏమి మాట్లాడిన కూడా నెటిజెన్స్ ట్రోల్ల్స్ చేసిన సంఘటనలు ఎన్నో చూసాము..ఇప్పుడు లేటెస్ట్ గా అల్లు అర్జున్ గారి కూతురు అల్లు అర్హ మీద కూడా నెగటివిటీ ప్రారంభం అయ్యిపోయింది..చిన్న పసిపాప మీద కూడా ట్రోల్ల్స్ చెయ్యడం చూస్తుంటే ప్రస్తుతం సోషల్ మీడియా ఎంత నీచంగా తయారు అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.
ఇక అసలు విషయానికి వస్తే, ఇటీవల ఒక్క ఇంటర్వ్యూ లో అల్లు అర్హ తో ఒక్క యాంకర్ సరదాగా చేస్తున్న చిట్ చాట్ లో భాగంగా ‘నీ పేరు ఏమిటి పాపా’ అని యాంకర్ అడగగా, దానికి అల్లు అర్హ సమాధానం ఇస్తూ ‘నా పేరు అల్లు అర్హ రెడ్డి’ అంటూ సమాధానం ఇచ్చింది..ఆమె చెప్పిన ఈ సమాధానమే ఇప్పుడే సోషల్ మీడియా లో నెగటివిటీ కి కారణం అయ్యింది..ఎందుకంటే అల్లు అర్జున్ కాపు సామజిక వర్గానికి చెందిన వ్యక్తి అనే విషయం మన అందరికి తెలిసిందే..ఇక ఆయన సతీమణి స్నేహ రెడ్డి సామజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి..దశాబ్దాల నుండి వస్తున్నా మన సంస్కృతి ప్రకారం తండ్రి పేరు కూతురు పేరు కి కానీ , కొడుకు పేరుకి గాని చివర్లో జతపర్చడం మన అందరికి తెలిసిన విషయమే..కానీ ఇక్కడ రివర్స్ లో తల్లి సామజిక వర్గానికి చెందిన కులం పేరు ని పెట్టడం ఏమిటి అని, పిల్లలకి అసలు వీళ్లిద్దరు ఏమి చెప్పి నేర్పిస్తున్నారు అంటూ సోషల్ మీడియా లో నెటోజెన్లు విరుచుకుపడుతున్నారు.
Also Read: Jai Balayya: అరెరే.. ‘అన్నగారు` వద్దు, ‘జై బాలయ్య’ ముద్దు !
చిన్న పిల్ల ఎదో తెలియక మాటవరుసకి అన్నదానిపై ఇంత రగడ చెయ్యాల్సిన అవసరం ఏమి ఉంది అని..అసలు మీరు మనుషులేనా అంటూ అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా లో ప్రత్యర్థుల పై ఎదురు దాడి కి దిగుతున్నారు..ఇక ఈ వివాదం కి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి..ఇక అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 షూటింగ్ కి సర్వం సిద్ధం చేసుకుంటున్నాడు..ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు అన్ని పూర్తి చేసిన సుకుమార్ జూన్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ని ప్రరంబించడానికి సన్నాహాలు చేస్తున్నాడు అట..పుష్ప పార్ట్ 1 కంటే కూడా పార్ట్ 2 ప్రేక్షకులను మరియు అభిమానులను ఉర్రూతలూ ఊగించే విధంగా ఉంటుంది అని ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న టాక్..ఈ ఏడాది చివరిలోపు పూర్తి చేసి, వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకోచేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: Modi HYD Tour హైదరాబాద్ పర్యటనలో 17 ప్రశ్నలతో మోడీకి షాకిచ్చిన టీఆర్ఎస్