https://oktelugu.com/

Rashmika: రష్మికను ఆడేసుకుంటున్న నెటిజన్లు.. ఎక్కడ పడితే అక్కడ ఆ పనేనా అంటూ కామెంట్లు

Rashmika: ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప మేనియానే నడుస్తోంది. డిసెంబరు 17న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తోంది. సుకుమార్​ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్​ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. కాగా, ఇందులో హీరోయిన్​గా రష్మిక అలరించింది. నేషనల్​ క్రష్​గా కుర్రాళ్ల మనసుల్ని కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. పుష్పలో డీ గ్లామర్​ రోల్​లో పోషించింది. ఇందులో శ్రీవల్లిగా కనిపించిన రష్మిక నటన అద్భుతమని ప్రేక్షకులు పొగడ్తలతో ముంచెత్తారు.  ఈ సినిమాలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 22, 2021 / 01:48 PM IST

    Rashmika

    Follow us on

    Rashmika: ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప మేనియానే నడుస్తోంది. డిసెంబరు 17న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తోంది. సుకుమార్​ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్​ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. కాగా, ఇందులో హీరోయిన్​గా రష్మిక అలరించింది. నేషనల్​ క్రష్​గా కుర్రాళ్ల మనసుల్ని కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. పుష్పలో డీ గ్లామర్​ రోల్​లో పోషించింది. ఇందులో శ్రీవల్లిగా కనిపించిన రష్మిక నటన అద్భుతమని ప్రేక్షకులు పొగడ్తలతో ముంచెత్తారు.  ఈ సినిమాలో విడుదలైన ప్రతి పాట ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. అందులో  రారా సామి పాటకు రష్మిక మంచి క్రేజ్ దక్కించుకుంది. ఈ సాంగ్​లోని స్టెప్​తో సోషల్​మీడియా, ప్రెస్​మీట్​ ఇలా ఎక్కడపడితే అక్కడ అందర్నీ తనవైపు ఆకట్టుకుంటోంది.

    Rashmika

    Also Read: నెటిజన్​ కామెంట్​కి దిమ్మతిరిగే కౌంటర్​ ఇచ్చిన రష్మిక

    పుష్ప ప్రమోషన్స్​ మొదలుపెట్టినప్పటి నుంచి ఇటీవలే జరిగిన సక్సెస్​ మీట్​ వరకు ఈ స్టెప్​ లేకుండా మాత్రం స్టేజ్ నుంచి దిగడం లేదు రష్మిక. అయితే, ఈ స్టెప్​పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అసలు స్టెప్​తో తప్ప నోటితో మాట్లాడవా?.. అంటూ కామెంట్లతో ఆడేసుకుంటున్నారు. ఇంకొంత మంది ఎక్కడ పడితే అక్కడ అసలు ఏంటి మాకీ రచ్చ రష్మిక అంటూ పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక వీడియోతో పాటు ఈ మీమ్స్ కూడా నెట్టింట ట్రెండింగ్​లో ఉన్నాయి.  కాగా, ఈ సినిమాలో అనసూయ, సునీల్​తో పాటు పలువురు కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా అమెజాన్​లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

    Also Read: ‘రారా సామీ’ స్టెప్పులతో ఇన్​స్టాలో రష్మిక వీడియో పోస్ట్​.. లక్షల్లో లైక్​లు