Manchu Lakshmi: మంచు వారి ఫ్యామిలీ కేర్ ఆఫ్ ట్రోల్స్ అని చెప్పొచ్చు. మోహన్ బాబు, మంచు లక్ష్మి, విష్ణులు తరచుగా ట్రోల్స్ కి గురవుతూ ఉంటారు. సొంత డప్పు కొట్టుకుంటారనే అపవాదు ఈ ఫ్యామిలీపై గట్టిగా ఉంది. ముఖ్యంగా మంచు లక్ష్మీ అమెరికన్ ఇంగ్లీష్, ఆ యాక్సెంట్ తో కూడిన తెలుగు మాటలను విపరీతంగా ట్రోల్ చేస్తారు. మంచు కుటుంబాన్ని ట్రోల్ చేస్తూ బ్రతికేసే యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో ఉన్నాయి. కొన్ని ఛానల్స్ ప్రత్యేకంగా దీని కోసమే పుట్టాయి. మంచువారి చర్యలు, మాటలు ట్రోలర్స్ కి అవసరమైన మెటీరియల్ దండిగా ఇస్తాయి.

కాగా మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్. ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లో ఆమె తరచుగా పోస్ట్స్ పెడుతూ ఉంటారు. అలాగే ఆమెకు ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్ లో తన పర్సనల్ వీడియోలు అప్లోడ్ చేస్తారు. ఆ మధ్య మంచు లక్ష్మి ఉత్తర భారతం వెళ్లారు. అక్కడ ఉన్న పుణ్య క్షేత్రాలు సందర్శించారు. కాగా గంగానదిలో స్నానం చేస్తున్న వీడియో మంచు లక్ష్మి షేర్ చేశారు. నీళ్లు చల్లగా ఉండటంతో ఆమె నదిలో నిండా మునగడానికి భయపడ్డారు. దాంతో ఓ మగ్ తీసుకొని ఒడ్డున కూర్చుని స్నానం చేశారు.
ఈ వీడియోలో మంచు లక్ష్మి స్నానం చేయడంతో పాటు గంగానదిని తన ఆడియన్స్ కి చూపించింది.ఇక ఇంగ్లీష్ లో నది గురించి, తన ట్రిప్ గురించి వివరించింది. ఈ వీడియో సైతం ట్రోల్స్ కి గురైంది. స్నానం చేస్తున్న వీడియో కూడా షేర్ చేయాలా? చేస్తే చేశావ్… ఆ ఓవర్ యాక్షన్ ఏంటంటూ మండిపడ్డారు. మంచు లక్ష్మి గంగానదిలో స్నానం చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ ట్రోల్స్ ని మంచు లక్ష్మి అసలు పట్టించుకోరు. పని లేని వాళ్ళు చేసే విమర్శలు పట్టించుకోను అంటారు. పలు ఇంటర్వ్యూల్లో ఆమె ఇదే చెప్పారు.

ఇక మంచు లక్ష్మి చాలా కాలం యూఎస్ లో ఉన్నారు. అక్కడ కొన్ని టెలివిజన్ షోస్ చేశారు. ఒకటి రెండు హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించారు. ఇండియా వచ్చాక హీరోయిన్ గా ప్రయత్నాలు చేశారు. 2011లో విడుదలైన అనగనగా ఓ ధీరుడు మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీలో ఆమె నెగిటివ్ రోల్ చేశారు. గుండెల్లో గోదారి చిత్రంలో తాప్సి తో పాటు మరొక హీరోయిన్ గా నటించారు. మంచు విష్ణు, మనోజ్ మాదిరి మంచు లక్ష్మికి కూడా బ్రేక్ రాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇమేజ్ సొంతం చేసుకోలేకపోయారు.
[…] […]
[…] […]