https://oktelugu.com/

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ శాడిజం…ఇవేం టాస్క్ లు బాబోయ్, ఒక్కొక్కరికీ చుక్కలు!

కేక్ మొత్తం తినగలితే మిగిలిన ఇంటి సభ్యులకు కూడా కేక్ లభిస్తుంది అని చెప్పారు. కేక్ తినడానికి అర్జున్ సిద్దమయ్యాడు. ఇంతలో ' అమర్ చూడడానికి .. మీకు పంపించిన కేక్ బాగుందా .. ఇది బాగుందా అని బిగ్ బాస్ అడిగారు.

Written By:
  • NARESH
  • , Updated On : December 6, 2023 / 07:59 PM IST
    Follow us on

    Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7 ఇప్పటికే 13 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు ఉన్నారు. అర్జున్ ఇంటి మొదటి ఫైనలిస్ట్ కావడంతో నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యాడు. ఇక మిగిలిన వారందరు నామినేషన్స్ లో ఉన్నారు. అయితే ఇది ఉల్టా పుల్టా సీజన్ కావడంతో ఓటింగ్ లో పెద్ద మార్పును తెచ్చారు బిగ్ బాస్. ఇక ఈ వారం వచ్చే వారం .. రెండు వారాలు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయి ఉంటాయని బిగ్ బాస్ తెలిపారు.

    ఆడియన్స్ తాము గెలవాలని కోరుకునే వారికి ఇప్పటి నుంచి ఓట్లు వేయొచ్చు అని చెప్పారు. ఇందుకు గాను కంటెస్టెంట్స్ ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేసుకునేందుకు బిగ్ బాస్ కొన్ని ఫన్ గేమ్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటి ఎపిసోడ్ లో యావర్, శోభా టాస్కుల్లో గెలిచారు. శోభా కు ఎక్కువ మద్దతు లభించడంతో ఆమె ఓట్ అప్పీల్ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ నేటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో అర్జున్ కి రెండు కేజీల కేక్ పంపించారు.

    కేక్ మొత్తం తినగలితే మిగిలిన ఇంటి సభ్యులకు కూడా కేక్ లభిస్తుంది అని చెప్పారు. కేక్ తినడానికి అర్జున్ సిద్దమయ్యాడు. ఇంతలో ‘ అమర్ చూడడానికి .. మీకు పంపించిన కేక్ బాగుందా .. ఇది బాగుందా అని బిగ్ బాస్ అడిగారు. దీంతో ‘ నాకు పంపిన కేక్ బాగుంది బిగ్ బాస్ ‘ అంటూ అమర్ అన్నాడు. కానీ తినడానికి ఇది బాగుంటుంది అంటూ అమర్ కి కౌంటర్ ఇచ్చారు.

    ఇక అర్జున్ కేక్ తినడం మొదలు పెట్టాడు. సగం తినేసరికి అర్జున్ చేతులెత్తేశాడు. దీంతో యావర్ తో కలిసి తిని కేక్ పూర్తి చేయవచ్చు బిగ్ బాస్ చెప్పారు. ఇక యావర్ రంగంలోకి కేక్ ని ఒక పట్టు పట్టాడు. ఎలాగో తిప్పలు పడుతూ అర్జున్, యావర్ లు కేక్ కంప్లీట్ చేశారు. ఈ టాస్క్ లు చూసి ఆడియన్స్ కూడా బిగ్ బాస్ లాస్ట్ లో శాడిజం చూపిస్తున్నాడని వాపోతున్నారు. మరోవైపు టైటిల్ విన్నర్ ఎవరనే ఉత్కంఠ నడుస్తుంది.