Venu Swamy: యూట్యూబ్ లో చాలా రోజుల నుంచి జ్యోతిష్యం చెబుతూ తనే పెద్ద తోపు లా ఫీల్ అయిపోయి ప్రతి ఒక్క సెలబ్రిటీ లైఫ్ ఎలా ఉండబోతుందో క్లియర్ గా చెబుతున్నట్టుగా కలరింగ్ ఇస్తూ వస్తున్న వేణు స్వామి ని ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ ఫాన్స్ విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు…
అయితే ఆయన మొదట్లో చెప్పిన ఒకటి రెండు నిజం అవడంతో తను చెప్పిందే వేదం అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఈ హీరో పని అయిపోయింది. ఆ పొలిటిషన్ ఇక పనికిరాడు అంటూ తనకు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చిన సెలబ్రిటీ పట్ల తనకు నచ్చిన విధంగా మాట్లాడాడు.
ఇక అందులో భాగం గానే ప్రభాస్ గురించి మాట్లాడుతూ తన పని అయిపోయింది. బాహుబలి 2 తోనే తను పీక్స్ లెవెల్ చూశాడు. ఇక దాని తర్వాత ఆయనకి అంత పెద్ద సక్సెస్ అయితే రాదు ఇప్పుడు చేస్తున్న సినిమాల ప్రొడ్యూసర్లు అందరూ కూడా నట్టేట మునిగినట్టే అంటూ కామెంట్లు చేసి ప్రభాస్ ఫ్యాన్స్ చేత కోపానికి గురయ్యాడు.
కానీ ప్రభాస్ ఫ్యాన్స్ అనుకున్న సమయం కోసం వేచి చూశారు. దానికి అనుగుణంగానే సలార్ సినిమా రిలీజ్ అయి భారీ సక్సెస్ ని సాధించింది. కేవలం ఐదు రోజుల్లోనే 600 కోట్ల కలక్షన్లు సాధించింది. ఇక ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి ఈ సంవత్సరం అత్యధిక కలక్షన్లను వసూలు చేసిన సినిమాగా పేరు సంపాదించుకునే దిశగా ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇప్పుడు వేణు స్వామి చెప్పిన జాతకం వట్టి బుర్రకథ అంటూ ప్రభాస్ సలార్ సినిమాతో నిరూపించడంతో సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ అభిమానులు వేణు స్వామిని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక నువ్వు జాతకం చెప్పడానికి పనికి రావు అంటూ మరికొంతమంది అతన్ని కామెంట్స్ చేస్తూ వేణు స్వామి ని ఆడుకుంటున్నారు…
ఇక ప్రభాస్ విషయం పక్కనపెడితే ఈసారి తెలంగాణ సీఎం కేసీఆర్ అవుతాడు అంటూ బల్ల గుద్ధి చెబుతున్నాను అంటూ మాట్లాడాడు కేసీఆర్ జాతకం ప్రకారం అతను తప్పకుండా మూడోసారి కూడా సీఎం అవుతాడు అంటూ చెప్పాడు దాన్ని కూడా ప్రస్తావిస్తూ కెసిఆర్ సిఎం అవ్వలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు రేవంత్ రెడ్డి ఫాలోవర్స్ కూడా ఈ విషయాన్ని గుర్తు చేస్తూ తీవ్రస్థాయిలో వేణు స్వామి ని విమర్శిస్తూ విపరీతమైన ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఇక దీంతో ఇంకోసారి వేణు స్వామి ఓపెన్ గా ఎవరి జాతకం చెప్పను అనే స్టేజ్ కి వచ్చాడు…