https://oktelugu.com/

Trivikram : త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా స్టోరీ ఏంటో చెప్పేస్తున్న నెటిజన్లు…

నిజంగా ఇపుడున్న యంగ్ డైరెక్టర్లందరూ సైన్స్ ఫిక్షన్, గ్రాఫిక్స్ కి ప్రాధాన్యమున్న సినిమాలను చేస్తుంటే త్రివిక్రమ్ మాత్రం స్టార్ హీరోలా డేట్స్ తీసుకొని కూడా రొటీన్ రోట్ట ఫార్ములా సినిమాలను చేస్తూ ముందుకు సాగడం అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. అందువల్లే ఇప్పుడు తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటూ చాలామంది విమర్శకులు సైతం త్రివిక్రమ్ పైన భారీ విమర్శలు చేస్తున్నారు...దాంతో త్రివిక్రమ్ కూడా ఇప్పుడు ఒక కొత్త జానర్ లో కథ రెఢీ చేస్తున్నట్టు గా తెలుస్తుంది...

Written By:
  • NARESH
  • , Updated On : March 4, 2024 / 08:44 PM IST
    Follow us on

    Trivikram : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్..ఈ సంక్రాంతి కి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ ఫ్లాప్ ని అందుకున్నాడు… ఇక దాంతో త్రివిక్రమ్ మీద చాలా రోజుల నుంచి ట్రోలింగ్స్ అయితే విపరీతంగా వస్తున్నాయి.

    అవి ఏంటి అంటే త్రివిక్రమ్ ప్రతి సినిమాలో తండ్రి, తల్లి సెంటిమెంట్లను చూపిస్తూ సినిమాలు రాస్తున్నాడు తప్ప పెద్దగా కొత్తదనం అయితే ఏమీ చూపించట్లేదు అనే వార్తలైతే వస్తున్నాయి. అప్పటి నుంచి త్రివిక్రమ్ పెద్దగా కెమెరా ముందుకు కూడా రావడం లేదు. దాంతో సినిమా స్క్రిప్ట్ రాసుకునే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇది తెలిసిన కొంతమంది నెటిజన్లు మాత్రం త్రివిక్రమ్ ఇక అమ్మ నాన్న సెంటిమెంట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అక్క చెల్లెళ్ల సెంటిమెంట్ మీద కథలు రాస్తున్నాడేమో అంటూ ఆయన మీద సోషల్ మీడియాలో చాలా సెటైరికల్ గా పంచులు వేస్తున్నారు.

    ఇక ఇది తెలిసిన కొంతమంది త్రివిక్రమ్ అభిమానులు హర్ట్ అవుతూ కామెంట్ చేసే వాళ్ల మీద సెటైర్లను కూడా వేస్తున్నారు. ఇక మొత్తానికైతే త్రివిక్రమ్ తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవకాశమైతే వచ్చింది. ఎందుకంటే ఇప్పటివరకు త్రివిక్రమ్ హవా నడిచింది. ఇక అన్నివేళలా మన టైం నడుస్తుంది అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. అందుకోసం ఇప్పుడు తనని తాను చేంజ్ చేసుకొని ఒక కొత్త జానర్ లో సినిమాలు చేస్తే తప్ప త్రివిక్రమ్ ని ఇష్టపడే అభిమానులు ఉండారనే చెప్పాలి. అలా చేయాలి అంటే త్రివిక్రమ్ ఇప్పుడు ఒక మంచి కథను అయితే రాసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

    నిజంగా ఇపుడున్న యంగ్ డైరెక్టర్లందరూ సైన్స్ ఫిక్షన్, గ్రాఫిక్స్ కి ప్రాధాన్యమున్న సినిమాలను చేస్తుంటే త్రివిక్రమ్ మాత్రం స్టార్ హీరోలా డేట్స్ తీసుకొని కూడా రొటీన్ రోట్ట ఫార్ములా సినిమాలను చేస్తూ ముందుకు సాగడం అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. అందువల్లే ఇప్పుడు తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటూ చాలామంది విమర్శకులు సైతం త్రివిక్రమ్ పైన భారీ విమర్శలు చేస్తున్నారు…దాంతో త్రివిక్రమ్ కూడా ఇప్పుడు ఒక కొత్త జానర్ లో కథ రెఢీ చేస్తున్నట్టు గా తెలుస్తుంది…