Sivaji vs Anasuya: రీసెంట్ గా జరిగిన ‘దండోరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ నటుడు శివాజీ(Sivaji) హీరోయిన్స్ ధరించే దుస్తులపై చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. ఒకరోజు కాకపోతే మరుసటి రోజు అయినా ఈ అంశం చల్లారుతుందేమో అనుకుంటే, రోజు రోజుకి పెద్దది అవుతోంది. సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా రెస్పాన్స్ ఇస్తూ శివాజీ వ్యాఖ్యలను తప్పుబడుతూ వీడియోలు చేస్తున్నారు. శివాజీ బహిరంగంగా క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా ఎవ్వరూ తగ్గడం లేదు. కానీ మరోపక్క శివాజీ కి మద్దతు పలికే వాళ్ళ సంఖ్య కూడా చాలా పెద్దది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే శివాజీ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. ఆయన రెండు తప్పు పదాలు ఉపయోగించింది వాస్తవమే, అందుకు ఆయన క్షమాపణలు చెప్పాడు, కానీ అతని ఇచ్చిన స్టేట్మెంట్ నిజమే కదా, హీరోయిన్స్ పబ్లిక్ ఫంక్షన్స్ కి వేసుకొని వచ్చే దుస్తులు చూసేందుకు మాకు కూడా ఇబ్బందిగానే ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే సోషల్ మీడియా లో నెటిజెన్స్ అయితే అనసూయ శివాజీ కామెంట్స్ కి ఇచ్చిన రియాక్షన్స్ ని చూసి వేరే లెవెల్ లో ట్రోల్ చేస్తున్నారు. అల్లరి నరేష్ హీరో గా నటించిన ‘సుడిగాడు’ అనే సినిమా మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అందులో అల్లరి నరేష్ పరిచయ సన్నివేశం హిలేరియస్ గా ఉంటుంది. సన్నివేశం ఏమిటంటే, రౌడీలు మార్కెట్ లోకి వచ్చి అందరి వద్ద రౌడీ మామూలు వసూలు చేస్తూ ఉంటాడు. అలా ఒక చిప్స్ అమ్ముకునే వ్యక్తి వద్ద వచ్చి రౌడీ మామూలు అడగ్గా, కలెక్షన్స్ లేవని అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న తన కూతురు ని లాక్కొస్తాడు. ఆమె స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకొని ఉంటుంది. ‘ఏరా..నీ కూతురికి ఈ అందాన్ని చూసే కదా ఇంత పొగరు..ఇప్పుడు ఆ అందాన్ని మేము కప్పేస్తాము రా అని, ఆ రౌడీ తొడుక్కున్న జాకెట్ ని ఆమెకు కప్పుతాడు’.
అప్పుడు ఆమె తండ్రి ‘ఇలాంటి డ్రెస్సులు వేసుకొని తిరిగితేనే దానిని ఎవ్వరూ పెళ్లి చేసుకోవడం లేదు, ఇప్పుడు దాని అందాన్ని కప్పేస్తే ఎవరు పెళ్లి చేసుకుంటారు అయ్యా’ అని ఏడుస్తాడు. ఈ సీన్ మొత్తం వేరే లెవెల్ ఫన్ తో ఉంటుంది. ఈ సన్నివేశం లో రౌడీ స్థానం లో శివాజీ ముఖాన్ని పెట్టి, అమ్మాయి స్థానం అనసూయ ముఖాన్ని పెడుతారు. 2012 వ సంవత్సరం లో ఈ సన్నివేశాన్ని చూసి మనం బాగా నవ్వుకున్నాం , 2025 వ సంవత్సరం లో రియాలిటీ లో చూస్తున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. ఆ వీడియో ని మీరు కూడా క్రింద చూడొచ్చు.
ఈ సినిమా వచ్చినపుడు నవ్వుకున్నాం గానీ
2025 వచ్చేసరికి ఇదే రియాలిటీ అయిపోయిందిభీమినేని అప్పుడే భవిష్యత్తుని ఊహించి రాశాడు pic.twitter.com/LyoT6YX7a1
— పల్నాడు పెద్దిరెడ్డి (@MrHyperReddy) December 25, 2025