
Anchor Rashmi : యాంకర్ గా రష్మీ గౌతమ్ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో ఆమె యాంకర్ గా ఉన్నారు. గత ఏడాది అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకుంది. దాంతో జబర్దస్త్ కి కూడా యాంకర్ గా వ్యవహరించారు. కొన్ని వారాల తర్వాత కన్నడ అమ్మాయి సౌమ్యరావుని జబర్దస్త్ యాంకర్ గా తీసుకున్నారు. ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ లో మాత్రమే సందడి చేస్తున్నారు. అయితే ఢీ షో నుండి మల్లెమాల టీం రష్మీ గౌతమ్ ని తప్పించారు. సీజన్ 13 వరకు సుధీర్-రష్మీ గౌతమ్ యాంకర్స్ గా వ్యవహరించారు.
హీరోయిన్ గా ఆమె కెరీర్ నెమ్మదించింది. ఆఫర్స్ రావడం లేదు. రష్మీ గౌతమ్ నటించిన చివరి చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. 2022లో విడుదలైన ఈ చిత్రం కూడా నిరాశపరిచింది. బొమ్మ బ్లాక్ బస్టర్ కోసం రష్మీ గౌతమ్ బాగా కష్టపడ్డారు. గట్టిగా ప్రమోషన్స్ నిర్వహించింది. ఫలితం మాత్రం శూన్యం. రెండేళ్ల క్రితం వరకు రష్మీ విరివిగా సినిమాలు చేశారు. ఆమె హీరోయిన్ గా నటించిన ఒక్క చిత్రం విజయం సాధించలేదు. ఈ క్రమంలో మేకర్స్ ఆమెను పక్కన పెట్టేశారు. ఈ విషయంలో అనసూయ సక్సెస్ అయ్యారు.
రష్మీ పరిశ్రమకు వచ్చింది హీరోయిన్ కావాలనే. చాలా సినిమాల్లో ఆమె సపోర్టింగ్ రోల్స్ చేశారు. హీరోయిన్ అవకాశాలు రావని డిసైడ్ అయ్యాక యాంకరింగ్ వైపు మళ్లారు. వ్యక్తిగత కారణాలతో అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకున్నారు. అప్పుడు ఆమె స్థానంలో రష్మీ ఎంట్రీ ఇచ్చింది. షో సూపర్ సక్సెస్ కాగా ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ మరో షో స్టార్ట్ చేశారు. ఆ విధంగా అనసూయకు మరలా రీఎంట్రీ దక్కింది. ఆ షో వేదికగా ఇద్దరూ స్టార్స్ గా అవతరించారు. హీరోయిన్ కావాలన్న రష్మీ కోరిక తీరింది.
ఇక రష్మీ పెళ్లి ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. తరచుగా మీకు పెళ్లి ఎప్పుడని ఆమెను అడుగుతుంటారు. ఆమె కూల్ గా దానికి ఇంకా సమయం ఉందని చెబుతుంది. బుల్లితెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్, రష్మీ ప్రేమించుకుంటున్నారనే వాదన ఎప్పటి నుండో ఉంది. ఏళ్ల తరబడి వీరు షోలలో రొమాన్స్ కురిపించారు. అయితే ఇదంతా హైప్ కోసమే. వాస్తవంలో మేము స్నేహితులం మాత్రమే అంటుంటారు. సుడిగాలి సుధీర్ సైతం పెళ్లి మాట ఎత్తడం లేదు. దీంతో ఏదో ఒకరోజు ఇద్దరూ సడన్ షాక్ ఇస్తారేమో అనే అనుమానాలు కొనసాగుతున్నాయి.
తాజాగా రష్మీ బ్లాక్ కలర్ చోళీ లెహంగా ధరించారు. దుపట్టా పక్కకు జరిపి ఎద అందాల ప్రదర్శన చేసింది. రష్మీ గ్లామరస్ ఫోటోలు చూసిన నెటిజన్స్ కొంటె కామెంట్స్ చేస్తున్నారు. రష్మీ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.
View this post on Instagram