Dulquer Salmaan: ఇతర భాషల నుండి మన టాలీవుడ్ లోకి వచ్చే నటీనటులు మంచి సినిమాలు తీస్తే మన తెలుగు ఆడియన్స్ నెత్తిన పెట్టుకొని మరీ ఆరాధిస్తారు. ఇది మొదటి నుండి జరుగుతున్నదే. కార్తీ వంటి తమిళ హీరోలు కొంతమంది మన తెలుగు హీరోలకంటే గొప్పగా తెలుగు మాట్లాడుతారు, తెలుగు ఆడియన్స్ ని ఎంతో గౌరవిస్తారు. అలాంటి వాళ్లంటే మనోళ్లకు ఎప్పటికీ ఎనలేని ప్రేమ ఉంటుంది. కానీ కొంతమంది ఇతర భాషకు సంబంధించిన హీరోలకు తెలుగు మాట్లాడడం వచ్చు, కానీ కావాలని తెలుగు మాట్లాడేందుకు ఇష్టపడరు. అలాంటి హీరోల్లో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) కూడా ఒకడిగా చేరిపోతాడని మనం కలలో కూడా ఊహించలేదు. ఈయన్ని మన తెలుగు ఆడియన్స్ ఎంతలా ఆదరించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు ఈయన తెలుగు లో మహానటి,సీతారామం, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలు చేసాడు. అన్నీ కూడా ఒకదానిని మించి ఒకటి సూపర్ హిట్ అయ్యాయి.
దుల్కర్ సల్మాన్ ని మన ఆడియన్స్ మన తెలుగు హీరోలతో సమానంగా చూడడం మొదలు పెట్టారు. అంతే కాదు ఇప్పటి వరకు ఆయన తెలుగు లో చేసిన సినిమాలన్నిటికీ స్వయంగా ఆయనే డబ్బింగ్ చెప్పాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ నిన్న ఆయన ‘కొత్త లోక’ సక్సెస్ మీట్ లో ప్రవర్తించిన తీరు మన తెలుగు ఆడియన్స్ కి అసలు నచ్చలేదు. మలయాళం లోనే రీసెంట్ గా ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘లోక’ అనే చిత్రం విడుదలై కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. విడుదలైన మొదటి వారం లోనే వంద కోట్ల గ్రాస్ మార్కు కి దగ్గరగా వెళ్ళింది ఈ చిత్రం. ఈ చిత్రాన్ని మన తెలుగు లో ‘కొత్త లోక’ అనే పేరు తో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఈ చిత్రానికి మన ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ కి దుల్కర్ సల్మాన్ విచ్చేశాడు. ఈ ఈవెంట్ లో ముందు గా ఆయన మలయాళం లో మాట్లాడాడు. అయ్యో మలయాళం లో మాట్లాడేస్తున్నాను, అలవాటు లో పొరపాటు, అని ఇంగ్లీష్ లో చెప్పి, తన ప్రసంగం మొత్తాన్ని ఇంగ్లీష్ లోనే కొనసాగించాడు. ఇది మనోళ్లకు అసలు నచ్చలేదు. దుల్కర్ సల్మాన్ కి తెలుగు మాట్లాడడం వచ్చు. గతం లో ‘లక్కీ భాస్కర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, అదే విధంగా బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోలో దుల్కర్ సల్మాన్ స్వచ్ఛమైన తెలుగు బాషా మాట్లాడాడు. తెలుగు అంత బాగా మాట్లాడేవాడు, నిన్న కూడా తెలుగు లోనే మాట్లాడి ఉండొచ్చు కదా, అంటే ఇక్కడి ఆడియన్స్ రెండు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చేలోపు మనం ఏ భాషలో మాట్లాడినా చూసేస్తారు లే అనే పొగరు దుల్కర్ సల్మాన్ లో వచ్చిందా? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు.
