Sruti Haasan : శృంగారం లేకుండా ఒక్క‌రోజైనా ఉండ‌లేవా..? శృతిహాస‌న్ కు నెటిజ‌న్‌ ప్ర‌శ్న‌!

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ వార‌సురాలిగా చిత్ర ప‌రిశ్ర‌మలోకి ఎంట్రీ ఇచ్చింది శృతిహాస‌న్‌. అయితే.. ఈ బ్యూటీకి ఎంట్రీ పాస్ ఈజీగానే దొరికిన‌ప్ప‌టికీ.. స‌క్సెస్ మాత్రం అనుకున్నంత ఈజీగా ద‌క్క‌లేదు. మొద‌టి విజ‌యం కోసం చాలా కాలమే ఎదురు చూసింది శృతి. తెలుగులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ‘గ‌బ్బ‌ర్ సింగ్’తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న‌ శృతి.. ఆ త‌ర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. వ‌రుస హిట్ల‌తో దూసుకెళ్లింది. చాలా గ్యాప్ త‌ర్వాత ‘క్రాక్’తో తిరిగి టాలీవుడ్ కు […]

Written By: Bhaskar, Updated On : August 20, 2021 5:38 pm
Follow us on

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ వార‌సురాలిగా చిత్ర ప‌రిశ్ర‌మలోకి ఎంట్రీ ఇచ్చింది శృతిహాస‌న్‌. అయితే.. ఈ బ్యూటీకి ఎంట్రీ పాస్ ఈజీగానే దొరికిన‌ప్ప‌టికీ.. స‌క్సెస్ మాత్రం అనుకున్నంత ఈజీగా ద‌క్క‌లేదు. మొద‌టి విజ‌యం కోసం చాలా కాలమే ఎదురు చూసింది శృతి. తెలుగులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ‘గ‌బ్బ‌ర్ సింగ్’తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న‌ శృతి.. ఆ త‌ర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. వ‌రుస హిట్ల‌తో దూసుకెళ్లింది.

చాలా గ్యాప్ త‌ర్వాత ‘క్రాక్’తో తిరిగి టాలీవుడ్ కు వ‌చ్చింది. ఆ త‌ర్వాత వ‌కీల్ సాబ్ లోనూ మెప్పించింది. ఇప్పుడు ‘స‌లార్’ రాణీగా న‌టిస్తోంది. అయితే.. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ కు టైమ్ ఇస్తూనే ఉంటుంది. లేటెస్ట్ గా చేసిన చాట్ లో ఒక వ్యక్తి ఊహించ‌ని క్వ‌శ్చ‌న్ వేశాడు. శృంగారం లేకుండా మీరు ఉండ‌లేరా? అంటూ ఊహించ‌ని ప్ర‌శ్న వేశాడు. దీనికి దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్ ఇచ్చిందీ బ్యూటీ.

శృతిహాస‌న్ గతంలో లండన్‌కు చెందిన మైఖేల్ కోర్సలేతో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ చాలా కాలం డేటింగ్ లో ఉన్నారు. వీరి మూవ్ చూసిన వారంతా.. ఇక పెళ్లే త‌రువాయి అని అనుకున్నారు. ఈ జంట చెన్నైలో జరిగిన ఓ పెళ్లి వేడుకకు కలిసి హాజరయ్యారు కూడా. అయితే.. ఆ త‌ర్వాత‌ అభిప్రాయ బేధాలు రావడంతో 2019లోనే ఇద్దరూ విడిపోయారు.

అయితే.. ఆ త‌ర్వాత మ‌రొక‌రితో ప్రేమ‌లో ప‌డింది శృతి. శాంత‌ను హ‌జారికా అనే పెయింటింగ్ ఆర్టిస్టుతో ల‌వ్ ట్రాక్ న‌డుపుతోంది. వీళ్లిద్ద‌రూ ప్ర‌స్తుతం ముంబైలో క‌లిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుంటారు అనే ప్ర‌చారం కూడా సాగుతోంది. ఈ నేప‌థ్యంలోనే సోష‌ల్ మీడియాలో.. ఫ్యాన్స్ తో నిర్వ‌హించిన క్వ‌శ్చ‌న్ అవ‌ర్ లో ఓ వ్య‌క్తి ఊహించ‌ని ప్ర‌శ్న వేశాడు.

‘‘సెక్స్‌, ఆహారం ఈ రెండిట్లో ఏది లేకుండా నువ్వు ఒక‌రోజు గ‌డ‌ప‌గ‌ల‌వు’’ అని అడిగాడు. ఈ ప్ర‌శ్న‌కు దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చింది శృతి. ‘‘ఇందులో చెప్ప‌డానికి ఏముందీ? ఆహారం లేకుండా మీరు బ‌త‌క‌గ‌ల‌రా? తిండి లేకపోతే చనిపోతాం అన్న విషయం మీకు తెలియదనుకుంటా. అయినా.. చీకట్లో సొరంగంలోకి దిగితే.. చీకటి తప్ప ఇంకేమీ కనిపించదు’’ అని ఆన్స‌ర్ ఇచ్చింది. అంటే.. ఎలా ఆలోచించే వాళ్ల‌కు అలాంటి ఆలోచ‌న‌లే వ‌స్తాయి అంటూ ఎన్ కౌంటర్ చేసేసింది శృతి. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు వైర‌ల్ అవుతున్నాయి.