పాయల్ రాజ్ పుత్ ఈ పేరు వింటే చాలు కుర్రకారులలో ఎక్కడ లేని సంతోషం పుట్టుకొస్తుంది. ఇండస్ట్రీలోకి వచ్చి మొదటి సినిమాతోనే బోల్డ్ పాత్రలలో నటించి ఎంతో మంది విమర్శలు అందుకున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఈమె గ్లామర్ పాత్రల్లో నటిస్తూ, ఎంతోమంది కుర్రకారల మనసులను కొల్లగొట్టింది. తాను నటించిన మొదటి సినిమా “RX 100″మంచి విజయం అందుకోవడంతో ఈమెకు వరుస అవకాశాలు వచ్చాయి.
హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమెకు ఇతర భాషలలో కూడా వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరోవైపు పలు వెబ్ సిరీస్ లలో చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. వరుసగా సినిమాలు వెబ్ సిరీస్ లో చేస్తున్న పాయల్ స్పెషల్ సాంగ్స్ కి సైతం రెడీ అంటుంది.ఈ క్రమంలోని సీత సినిమాలో “బుల్లెట్ మీద వచ్చే బుల్ రెడ్డి”అనే ప్రత్యేక పాటను చేసి ఎంతో మందిని ఆకట్టుకుంది.అదేవిధంగా సిద్ధార్థ్ శర్వానంద్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న “మహాసముద్రం” సినిమాలో కూడా ఈమె ఓ ప్రత్యేక పాటలో సందడి చేయనున్నట్లు సమాచారం.
కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న పాయల్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. వృత్తి పరంగా మాత్రమే కాకుండా,వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన లవర్ పేరు సౌరబ్ డింగ్రా అని, అతడి ఫొటోను రివీల్ చేసింది. అంతేకాదు, ఈ మధ్య అతనితో కలిసి దిగుతున్న ప్రతి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు.
పాయల్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ఆమె ప్రియుడు కుడా అంతే యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే సౌరబ్ సోషల్ మీడియా ద్వారా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించాడు. ఈ సందర్భంగా పాయల్ గురించి నెటిజన్ ప్రశ్న అడిగి సౌరబ్ డింగ్రాకి దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. ఆ నెటిజన్ ఏకంగా పాయల్ ఫోన్ నెంబర్ అడిగి అతడికి షాకిచ్చాడు. దీంతో ఆ నెటిజన్ అడిగిన ప్రశ్న స్క్రీన్ షాట్ తీసుకున్న పాయల్ రాజ్ పుత్ దీనికి సమాధానంగా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 100 అని కామెంట్ పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ విధంగా నెటిజన్ అడిగిన ప్రశ్నకు పాయల్ గట్టిగా చెప్పిన సమాధానం పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.