Ustaad Bhagat Singh OTT Rights: 12 ఏళ్ళ క్రితం విడుదలైన ‘గబ్బర్ సింగ్’ చిత్రం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ ని ఏ రేంజ్ లో అయితే మలుపు తిప్పిందో, గత ఏడాది విడుదలైన ‘ఓజీ'(They Call Him OG) చిత్రం కూడా అదే రేంజ్ లో ఆయన కెరీర్ ని మలుపు తిప్పింది. పవన్ కళ్యాణ్ తోటి స్టార్ హీరోలందరూ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ వేరే లెవెల్ కి వెళ్తుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం రీమేక్ సినిమాలు చేస్తూ తన మార్కెట్ ని చెడగొట్టుకుంటున్నాడని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉండేవారు. అలాంటి సమయం లో వచ్చిన ఈ ‘ఓజీ’ చిత్రం యావరేజ్ టాక్ తో, ‘కాంతారా 2’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని ఎదురుగా పెట్టుకొని, దాదాపుగా 328 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది ఈ చిత్రం. ‘గబ్బర్ సింగ్’ చిత్రం పవన్ కళ్యాణ్ కొత్త జనరేషన్ కి సంబంధించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఎలా అయితే తెచ్చిపెట్టిందో, ఓజీ చిత్రం కూడా అలా పవన్ కళ్యాణ్ జెన్ Z ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టింది.
ఈ సినిమా తర్వాత ఆయన నుండి రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh Movie) చిత్రానికి కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమా ఓటీటీ డిజిటల్ రైట్స్ ని 2023 వ సంవత్సరం లో అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు ఆ సంస్థ ఈ చిత్రాన్ని వదిలేసింది. నిర్మాతలు అడిగినంత డబ్బులు ఇవ్వడానికి అమెజాన్ ప్రైమ్ సంస్థ ఒప్పుకోకపోవడం వల్లే తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ సంస్థ గత ఏడాది కొనుగోలు చేసిన ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి ఫ్లాప్ రెస్పాన్ రావడమే. మరోపక్క నెట్ ఫ్లిక్స్ సంస్థ ఓజీ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసి భారీ లాభాలను అందుకుంది. విశేల్షకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఓజీ చిత్రానికి ఇప్పటి వరకు 15 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి.
రాబోయే రోజుల్లో ఇది 20 మిలియన్ వ్యూస్ ని కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంత పెద్ద హిట్ అయ్యి తమ సంస్థకు భారీ లాభాలు తీసుకొని రావడం తో, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని దాదాపుగా 95 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఒకే ఒక్క సినిమా తర్వాత పవర్ స్టార్ రేంజ్ ఓటీటీ మార్కెట్ లో ఎలా పెరిగిపోయిందో మీరే చూడండి. ఓజీ చిత్రం లోని సన్నివేశాలను కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ మరియు ఇతర సోషల్ మీడియా మాధ్యమాలలో ఓజీ మూవీ సన్నివేశాలను విపరీతంగా ఉపయోగించడం మొదలు పెట్టారు. దీనిని బట్టీ ఈ చిత్రం జెన్ Z యువతలో పవన్ కళ్యాణ్ కి ఎలాంటి ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టిందో అర్థం చేసుకోవచ్చు.