Neha Sharma: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిరుత మూవీ తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు నేహా శర్మ . ఆ సినిమా హిట్ కావడంతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుంది అని అనుకున్నారు. కానీ వరుణ్ సందేశ్ “కుర్రాడు ” సినిమాలో నటించిన ఈ భామ ఆ సినిమా ఫ్లాప్ అవడంతో ఈ టాలీవుడ్ లో కనుమరుగయ్యారు. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు ఈ భామ. ప్రస్తుతం వెబ్ సిరీస్ , సినిమాలు, ఆల్బమ్ సాంగ్స్ వాటిలో నటిస్తున్నారు నేహా శర్మ.

బాలీవుడ్, టాలీవుడ్, కాక తాజాగా కోలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకున్నారు ఈ అమ్మడు. ఇటీవలే రేడియో జాకీ సిద్దార్థ్ కన్నన్ తో చేసిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ… 2018 లో స్నేహశర్మ సంబంధించిన ఓ సెల్ఫీని అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సెక్స్ టాయ్‌ను యాడ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని చెప్పింది. ఈ పోస్ట్ వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే ఈ విషయ్మ్ గురించి స్పందించారు నేహా శర్మ. ఇల్లీగల్ అనే వెబ్ సిరీస్ చేస్తున్న సమయంలో అందరూ వింతగా ప్రవర్తించారు. ఎవరూ కూడా మాట్లాడడం లేదు… నాకేం అర్థం కాలేదు అసలు ఏం జరిగిందని, నేను అడగగా ఎవరో నా దగ్గరకు వచ్చి నీ ఫోటో వైరల్ అవుతుందని చూపించారు. ఆ ఫోటో చూసి నాకేం అర్థం కాలేదు షాక్ అయ్యాను అని చెప్పుకొచ్చారు నేహా. అలా మార్ఫింగ్ చేయడం తప్పు అని… పని పాట లేక ఇలాంటి పనులు చేసే నెటిజన్ల పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.