Homeఎంటర్టైన్మెంట్Aadavallu Meeku Joharlu: లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకున్న "ఆడవాళ్లు మీకు జోహార్లు" మూవీ యూనిట్...

Aadavallu Meeku Joharlu: లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకున్న “ఆడవాళ్లు మీకు జోహార్లు” మూవీ యూనిట్…

Aadavallu meeku Joharlu: విజయదశమి పండగ సందర్భంగా శర్వానంద్ రష్మిక మందన్న జోడీగా తెరకెక్కనున్న “ఆడవాళ్లు మీకు జోహార్లు” పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమా కిషోర్ తిరుమల దర్శకత్వంలో… ఎస్ ఎల్ వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ స్వరాలను అందిస్తున్నారు.

aadavallu meeku joharlu movie team visiting antharvedi temple

ప్రస్తుతం అంతర్వేదిలో ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ జరుగుతుందట. వచ్చేనెలకి  ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంటారు అని  చిత్రం బృందం తెలిపింది. అందులో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. వేద పండితుల చేతుల మీదుగా ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాలను అందుకున్నారట. ఈ కార్యక్రమంలో  శర్వానంద్, రష్మిక మందన్న మరియు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ సినిమాలో రాధికా శరత్‌కుమార్, ఖుషుబు సుందర్, ఊర్వశి తదితరులు నటిస్తున్నారు అంతర్వేది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ జరిగినదట. ఈ చిత్రం ఈ ఏడాదిలో విడుదల కానుందని సమాచారం.

ఇటీవల విడుదలైన శర్వానంద్ నటించిన మహా సముద్రం… మూవీ ప్రేఖకుల అంచనాలను అందుకోలేదని చెప్పుకోవాలి. ఈ చిత్రంతో అయిన  మంచి సక్సెస్ సాధించాలని శర్వా భావిస్తున్నట్లు తెలుస్తుంది. అలానే  ఈ ఏడాది డిసెంబర్ లో రష్మిక నటించిన… పుష్ప సినిమా  విడుదల కానుంది. బాలీవుడ్ లో కూడా పలు చిత్రాల్లో నటించేందుకు ఈ భామ ఒకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular