NBK111: ‘అఖండ 2’ వంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు అవ్వని ఈ మూవీ ని ప్రస్తుతానికి NBK111 పేరుతో పిలుస్తున్నారు. వీర సింహా రెడ్డి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య తో గోపీచంద్ మలినేని చేస్తున్న చిత్రమిది. ఆ కారణం చేత ఈ సినిమాపై కేవలం అభిమానుల్లోనే కాదు , ప్రేక్షకుల్లో , ట్రేడ్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గానే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేయగా, దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య ని ఈసారి డైరెక్టర్ గోపీచంద్ చాలా స్టైలిష్ గా చూపించే ప్రయత్నం చేశారు. ఫ్యాన్స్ కి , ఆడియన్స్ కి బాలయ్య చాలా కొత్తగా అనిపించారు.
ఇకపోతే ఈ చిత్రం లో మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు అనే సంగతి తెలిసిందే. చాలా మంది ఆయన కచ్చితంగా విలన్ క్యారెక్టర్ చేస్తున్నారని అనుకున్నారు. అయితే లేటెస్ట్ గానే ఈ మూవీ సెట్స్ లోకి బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ అడుగుపెట్టడం తో అంచనాలు మారాయి. ఆయనే మెయిన్ విలన్ గా నటిస్తున్నట్టు సమాచారం. మరి మంచు మనోజ్ పాత్ర ఏమిటి?, ఆయన్ని ఈ సినిమాలో ఎలా చూపించబోతున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. రీసెంట్ గానే సంజయ్ దత్ , బాలయ్య మధ్య కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారట డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఈ సన్నివేశాలు సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని , యాక్షన్ మూవీ లవర్స్ కి ఈ సన్నివేశాలు విజువల్ ఫీస్ట్ లాగా అనిపిస్తాయని అంటున్నారు. సంజయ్ దత్ లాంటి నటులు ఈ సినిమాకు తోడు అవ్వడం తో ఈ సినిమా రేంజ్ బాగా పెరిగింది అనే చెప్పాలి.
ఎందుకంటే సంజయ్ దత్ ఏ సినిమాకు అయినా ప్లస్ అవుతారు. ఆయన పెర్ఫార్మన్స్ అద్భుతంగా ఉంటుంది , అదే విధంగా ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో విడుదల చేయడానికి కూడా సంజయ్ దత్ ఫేమ్ బాగా ఉపయోగపడుతుంది అనే చెప్పాలి. ఇద్దరు పవర్ ఫుల్ వ్యక్తుల మధ్య పోరాటం జరిగితే వెండితెర పై చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు అనే చెప్పాలి. చూడాలి మరి ఈ చిత్రం విడుదల తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అనేది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ని అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్.
