Nayanthara Vignesh Shivan : సౌత్ ఇండియా లో లేడీ సూపర్ స్టార్ గా పిలవబడే నయనతార(Nayanthara) 2022 వ సంవత్సరం లో సతీష్ విగ్నేష్(Satish Vignesh) అనే తమిళ దర్శకుడిని ప్రేమించి పెళ్లాడిన సంగతి మన అందరికీ తెలిసిందే. వీళ్ళ పెళ్లి మీద ఒక డాక్యుమెంటరీ వీడియో నెట్ ఫ్లిక్స్ లో విడుదలై ప్రపంచమంతా ట్రెండ్ అయ్యింది అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ జంటకు ఎలాంటి క్రేజ్ ఉంది అనేది. సరోగసి పద్దతి ద్వారా పిల్లల్ని పొందిన ఈ జంట, ప్రస్తుతం వాళ్ళతో కలిసి ఎంతో సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నారు. అయితే రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో నయనతార పెట్టిన ఒక పోస్ట్ ఎన్నో అర్థాలు దారి తీసింది. సతీష్ తో గొడవలు అయినట్టు ఉన్నాయి , త్వరలోనే వీళ్లిద్దరు విడాకులు తీసుకోబోతున్నారేమో అంటూ సోషల్ మీడియా లో అనేక వార్తలు ప్రచారం లోకి వచ్చాయి.
ఈ రూమర్స్ నయనతార వరకు చేరడం తో ఆమె కాసేపటి క్రితమే ఇన్ స్టాగ్రామ్ లో స్పందించింది. రీసెంట్ గా ఆమె తన భర్త తో కలిసిన ఫోటో ని ఒకటి అప్లోడ్ చేస్తూ, మేము ఎప్పుడైనా మా గురించి చెత్త న్యూస్ విన్నప్పుడు మా ఇద్దరి రియాక్షన్ ఇలాగే ఉంటుంది అంటూ ఒక ఫన్నీ స్టిల్ ని స్టోరీ లో షేర్ చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. దీంతో వీళ్లిద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ప్రస్తుతం నాన్తరర నిర్మాత గా కూడా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తన నిర్మాణం లో, సతీష్ విగ్నేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘LIK’ అనే చిత్రం షూటింగ్ కార్యక్రమాలను మొత్తం పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం గా ఉంది. ఇందులో హీరో గా లవ్ టుడే, డ్రాగన్ ఫేమ్ ప్రదీప్ రంగనాథం నటిస్తుండగా, హీరోయిన్ గా కృతి శెట్టి నటించింది.
రీసెంట్ గానే ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక పక్క నిర్మాతగా వ్యవహరిస్తూనే మరో పక్క సినిమాల్లో హీరోయిన్ గా ఫుల్ బిజీగా గడుపుతుంది నయనతార. రీసెంట్ గానే ఆమె మెగాస్టార్ చిరంజీవి , అనిల్ రావిపూడి చిత్రం లో హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండవ షెడ్యూల్ లో పాల్గొన్నది కూడా. సాధారణంగా ప్రొమోషన్స్ కి చాలా వారకు దూరం గా ఉంటూ వచ్చే నయనతార ఈ సినిమా ప్రొమోషన్స్ లో మాత్రం పాల్గొనడానికి ఓకే చెప్పింది. ఆమె ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇస్తున్నప్పుడే ఒక స్పెషల్ ప్రమోషనల్ వీడియో తో ఎంట్రీ ఇవ్వడం అందరినీ సర్ప్రైజ్ కి గురి చేసింది. మెగాస్టార్ చిరంజీవి తో ఆమెకు ఇది మూడవ చిత్రం. గతం లో గాడ్ ఫాదర్, సై రా నరసింహా రెడ్డి చిత్రాలు చేసింది.