Nayanthara Left Her Husband: సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే తన ప్రియుడు విఘ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లాడిన సంగతి మన అందరికి తెలిసిందే..బందు మిత్రుల సమక్షం లో ఈ జంట పెళ్లి మహాబలిపురం లోని ఒక రిసార్ట్ లో ఘనంగా జరిగింది..ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన ఫొటోలే తిరుగుతున్నాయి..త్వరలోనే వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన వీడియో ని రెండు భాగాలుగా చేసి విడుదల చెయ్యబోతున్నారు నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు..ఈ పెళ్లి వీడియో కోసం ఆమె అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు..ఇటీవలే ఆమె తన భర్త తో కలిసి బ్యాంకాక్ కి వెళ్ళింది..అక్కడ తన భర్త తో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ అభిమానులను ఆనందపరుస్తుంది నయనతార..ఇది ఇలా ఉండగా నయనతార అక్కడ చేసిన ఒక సంఘటన గురించి ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారిపోయింది.

Also Read: BJP Target On KCR: టార్గెట్ కేసీఆర్ బీజేపీ నాయకుల లక్ష్యం ఇదేనా?
ఇక అసలు విషయానికి వస్తే నయనతార తన భర్త విగ్నేష్ కి చెప్పాపెట్టకుండా హనీమూన్ నుండి తెల్లవారుజామునే ముంబై కి వెళ్లిపోయిందట..ఇక అసలు విషయానికి వస్తే నయనతార ప్రస్తుతం బాలీవుడ్ లో షారుక్ ఖాన్ తో కలిసి ‘జవాన్’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..ఈ సినిమాకి తమిళ టాప్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు..ఈ సినిమాలో నయనతార కి సంబంధించిన షెడ్యూల్స్ ఈరోజు నుండే ప్రారంభం కాబోతుందట..హనీమూన్ ధ్యాసలో పడి ఈ విషయాన్నే మర్చిపోయిందట నయనతార..తన పర్సనల్ మేనేజర్ ఈ విషయాన్నీ నయనతార కి గుర్తు చెయ్యడం తో ఆమె హుటాహుటిన హనీమూన్ నుండి వెంటనే ముంబై లొకేషన్ కి వెళ్లిపోయిందట..ఉదయం నిద్ర లేచి చూసేసరికి నయనతార హోటల్ లో లేకపోవడం ఎటు పోయిందో అని విఘ్నేష్ చాలా కంగారు పడ్డాడట..అయితే ఆ తర్వాత నయనతార కాల్ చేసి అర్జెంటుగా షూటింగ్ కి రావాల్సి వచ్చింది అని చెప్పడం తో విఘ్నేష్ కాస్త రిలాక్స్ అయ్యాడు..పెళ్లి తర్వాత కూడా నయనతార సినిమాల్లో నటిస్తుంది అనే విషయం మన అందరికి తెలిసిందే..బాలీవుడ్ లో జవాన్ సినిమాతో పాటుగా..టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలోనూ నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.

Also Read: Jagapathi Babu: షాకింగ్ : జగపతి బాబు సంచలన నిర్ణయం.. ఇది ఎవరూ ఊహించలేదు