Nayanthara: స్టార్ హీరోయిన్స్ లో నయనతార(Nayanathara) అద్భుతమైన నటి, ఈమెకు ఒక స్టార్ హీరోకి ఉన్నంత క్రేజ్ ఉంది, సౌత్ లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్, అందులో ఎలాంటి సందేహం లేదు. అభిమానులు ఆమెను ‘లేడీ సూపర్ స్టార్’ అని పిలుస్తుంటారు. ఆమె సినిమాలు కూడా అదే విధంగా ఆడాయి. అయితే నయనతార కి ఉన్న టాలెంట్ గురించి మాట్లాడడం కాసేపు పక్కన పెడితే, ఈమె అత్యంత అహంకార స్వభావం ఉన్న అమ్మాయి అనడం లో ఎలాంటి సందేహం లేదని చాలా మంది అంటుంటారు. ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమాలో ఆమె నటించినప్పటికీ, ప్రొమోషన్స్ లో పాల్గొనకపోవడం ఆమెకు ఒక అలవాటు. అది సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) సినిమా అయినా, మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) సినిమా అయినా, డేట్స్ ఇచ్చేటప్పుడే అగ్రిమెంట్ లో ఈ షరతులు పెడుతుంది. కొంతమందికి కొన్ని లక్షణాలు ఉంటాయి, వాటిని మార్చుకోలేము అనుకోవచ్చు.
Also Read: అక్షరాలా 150 కోట్లు..చరిత్ర సృష్టించిన ‘డ్రాగన్’..23 వ రోజు ఎంత వసూళ్లు వచ్చిందో తెలుసా?
కానీ నయనతార తన తోటి నటీనటులను అవమానించడంలో కూడా దిట్ట. రీసెంట్ గానే ఆమె సుందర్.సి దర్శకత్వం లో అమ్మన్ 2 అనే చిత్రాన్ని మొదలు పెట్టింది. ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు చెన్నై లో జరిగింది. ఈ పూజ కార్యక్రమాలకు నయనతార తో పాటు సీనియర్ హీరోయిన్ మీనా, రెజీనా కాసాండ్రా, కమెడియన్ యోగిబాబు వంటి వారు హాజరయ్యారు. అయితే ఈ పూజ కార్యక్రమంలో నయనతార సీనియర్ హీరోయిన్ మీనా(Actress Meena) ని అసలు పట్టించుకోలేదని సోషల్ మీడియా లో విమర్శలు వినిపిస్తున్నాయి. ఆమె దగ్గరకు వచ్చినా కూడా మాట్లాడలేదట, కలిసి ఫోటోలు దిగుతున్నప్పుడు కూడా ఆమె కనీసం మీనా కి ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదట. ఇంత పొగరు ఎందుకు?, మీనా తెలుగు, తమిళ భాషలతో పాటు ఇతర భాషల్లో కూడా అందరి స్టార్ హీరోల సరసన నటించి సూపర్ స్టార్ స్టేటస్ ని చూసింది.
ఆమె చూసిన విజయాల్లో, సాధించిన ఘనతలలో నయనతార తన కెరీర్ మొత్తం మీద పావు శాతం కూడా సాధించలేదు. భవిష్యత్తులో కూడా ఆమె రేంజ్ కి చేరుకోవడం అసాధ్యం. అలాంటి హీరోయిన్ పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా?, ఇదేమి సంస్కారం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ విరుచుకుపడ్డారు. గతం లో కూడా ఈమె మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ని ఇదే విధంగా అవమానించింది. ‘నానుమ్ రౌడీ దాన్’ అనే సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించింది. ఈమెకు ఆ సినిమాలో నటనకు గాను అవార్డు కూడా వచ్చింది. ఈ అవార్డు ని ఇచ్చేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని స్టేజి మీదకు ఆహ్వానించారు. కానీ ఆమె నాకు అల్లు అర్జున్ చేతుల మీదుగా తీసుకోవాలని లేదు, డైరెక్టర్ సతీష్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవాలని ఉందంటూ కామెంట్ చేసింది. దీంతో అల్లు అర్జున్ కి స్టేజి మీదనే పరువు పోయింది. ఇలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి.
Also Read: ‘దిల్ రూబ’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..’లైలా’ కంటే ఘోరమైన డిజాస్టర్..పాపం కిరణ్ అబ్బవరం!